HomeEntertainmentNagabandham: నాగబంధం కలెక్షన్ల సునామీ.. మూడు రోజులకి ఎంతంటే!

Nagabandham: నాగబంధం కలెక్షన్ల సునామీ.. మూడు రోజులకి ఎంతంటే!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


Nagabandham: నాగబంధం కలెక్షన్ల సునామీ.. మూడు రోజులకి ఎంతంటే!

Jul 6, 2026 6:39PM

 

ప్రేక్షకులనే అభిమానులుగా చేసుకొని మొన్న 3 న  భారీ అంచనాలతో విడుదలైన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం: ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా దర్శకుడు అభిషేక్ నామా ఈ విజువల్ వండర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దాదాపు 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువల కలయికగా రూపొందగా ప్రాచీన భారతదేశ చరిత్ర, బ్రహ్మకమలం రహస్య నిధిని కాపాడే ఒక యోధుడి కథాంశంతో తెరకెక్కింది.

  మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద తనదైన శైలిలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.  సినిమా బాక్సాఫీస్ ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే, మొదటి రోజు ‘నాగబంధం’ చిత్రం దేశవ్యాప్తంగా 3,202 షోల ద్వారా రూ. 3.25 కోట్ల నెట్ కలెక్షన్లతో శుభారంభం చేసింది. తొలి రోజు థియేటర్లలో సగటున 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ నుంచే అత్యధికంగా 2.90 కోట్ల వసూళ్లు రావడం విశేషం. మిగిలిన భాషల్లో హిందీ వెర్షన్  20 లక్షలు, తమిళం 10 లక్షలు, మలయాళంలో 3 లక్షలు, కన్నడ వెర్షన్  2 లక్షలు చొప్పున రాబట్టాయి. సినిమా రన్‌టైమ్ 3 గంటల 16 నిమిషాలుగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి ల్యాగ్ వస్తోందనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనిని గమనించిన మేకర్స్ వెంటనే స్పందించి ఏకంగా 31 నిమిషాల నిడివిని ట్రిమ్ చేశారు. ఈ సంచలన మార్పుతో 2 గంటల 45 నిమిషాల సరికొత్త క్రిస్పీ వెర్షన్ థియేటర్లలోకి రావడంతో శని, ఆదివారాల్లో బుకింగ్స్ మెరుగయ్యాయి.  రెండో రోజు శనివారం కూడా స్థిరంగా సాగిన ఈ చిత్రం, మూడో రోజు ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. దేశవ్యాప్తంగా లభించిన 1,904 షోల ద్వారా మూడో రోజు దాదాపు  3.02 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇది శనివారంతో పోలిస్తే కేవలం ఒకే ఒక్క శాతం డ్రాప్ మాత్రమే కావడం గమనార్హం. 

Also read: Amitabh bachchan: అమితాబ్ బచ్చన్ ల్యాండ్‌ డీల్‌.. రాత్రి 3 గంటల ఫోన్‌ కాల్‌ వెనుక అసలు కథ!

ఆదివారం నాడు తెలుగు 2D వెర్షన్‌లో సగటు ఆక్యుపెన్సీ 28.24 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం ఆటలకి  34.69 శాతం, ఈవినింగ్ షోలకు 34.54 శాతంతో థియేటర్లు నిండాయి. నైట్ షోలలో కూడా 25.77 శాతం ఆక్యుపెన్సీతో సినిమా నిలకడను చాటుకుంది.  ఈ మూడు రోజుల వీకెండ్ ముగిసేసరికి, ‘నాగబంధం’ చిత్రం సాధించిన మొత్తం వసూళ్ల లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా  9.47 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా, ఇండియా గ్రాస్ వసూళ్లు  11.06 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా . 1.25 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 3 రోజుల్లో మొత్తం 12.31 కోట్ల గ్రాస్ మార్కుని  అందుకుంది.

 



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments