HomeEntertainmentమూడేళ్లు కష్టపడి ఇలాంటి సినిమా తీశావేంటి అన్నా..!

మూడేళ్లు కష్టపడి ఇలాంటి సినిమా తీశావేంటి అన్నా..!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


మూడేళ్లు కష్టపడి ఇలాంటి సినిమా తీశావేంటి అన్నా..!

ప్రేక్షకుల మైండ్ సెట్ ను గుర్తించడం ఎవరి వల్లా కాదు. వందల కోట్లతో ఏళ్లకు ఏళ్లు కష్టపడి తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చూస్తున్నాయి. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలు భారీ రేంజ్ లో హిట్టు అవుతున్నాయి. తాజాగా నాగబంధం సినిమా భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కానీ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ మూవీలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, అనసూయ, మురళీ శర్మ, జగపతిబాబు, రిషబ్ సాన్వీ తదితరులు కీలక పాత్రలో నటించారు.

ప్రపంచవ్యాప్తంగా జూలై 3 న విడుదలైన ఈ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ నమోదయ్యాయి. మూడు రోజుల్లో ఈ మూవీకి కేవలం రూ.12.90 కోట్లు మాత్రమే వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇక సోమవారం నుంచి ఈ సినిమాను ఎంతమంది ప్రేక్షకులు చూస్తారు..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మొదటి షో తోనే ఈ సినిమా డివైడ్ టాక్ ను తెచ్చుకోవడంతో చాలామంది ఈ సినిమాను చూడడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Nagabandham Movie Review Abhishek Nama s Mythological Fantasy Spectacle Opens to a Mixed Response

ఈ మూవీని ఏకంగా రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. హిమాలయ పర్వతాల్లోని పురాతన విష్ణు దేవాలయాలు, అనంత పద్మనాభస్వామి ఆలయం, అలాగే దేశంలోని ఇతర చారిత్రాత్మక టెంపుల్స్ ను కాపాడే నాగదేవతల కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీలో విజువల్స్, వీఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. అలాగే మూవీ లెంగ్త్ కూడా ఎక్కువగానే ఉంది. దాంతో ప్రేక్షకులు బోర్ కొట్టినట్లు ఫీల్ అయ్యారు. సినిమాలోని చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లుగా ఉంది. దర్శకుడు అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ పడిన కష్టం స్క్రీన్ పై కనిపిస్తోంది. కానీ మూవీలో చాలా సీన్స్ కట్ చేస్తే బాగుండేదని అందరూ భావిస్తున్నారు. ఇక ఫుల్ రన్ లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments