HomeEntertainmentNtr: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కి గోల్డెన్ ఆఫర్.. జనగణమన, మెగా 158 సరసన...

Ntr: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కి గోల్డెన్ ఆఫర్.. జనగణమన, మెగా 158 సరసన నిలుస్తుందా!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


Ntr: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కి గోల్డెన్ ఆఫర్.. జనగణమన, మెగా 158 సరసన నిలుస్తుందా!

Jul 6, 2026 2:19PM

 
 
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)బావమరిది నార్నే నితిన్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలే అందుకు ఉదాహరణ.  ఈ అద్భుతమైన జోరును కొనసాగిస్తూ, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 5వ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రారంభించాడు. సౌత్ లో సరికొత్త సంచలనాలకు తెరలేపుతూ, దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్యూర్ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా  పూజా కార్యక్రమాలు నిన్న ఉదయం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముహూర్తపు షాట్‌కి  సంబంధించిన ఆసక్తికర విశేషాలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో భాగంగా నిర్మాత వెంకట్ కే నారాయణ స్వయంగా ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ కేఎస్ సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.  ‘మ్యాడ్’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్  మొదటి షాట్‌కి  గౌరవ దర్శకత్వం వహించడం విశేషం. అనంతరం నిర్మాత వెంకట్ కే నారాయణ చిత్రానికి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు రాధాకృష్ణ రెడ్డికి అధికారికంగా అందజేసి బెస్ట్ విషెస్ తెలిపారు.

Also read: Allu arjun: అల్లు అర్జున్ కోర్టు విచారణ తాజా అప్‌డేట్ ఇదే 

 నార్నే నితిన్ సరసన  అనికా సురేంద్రన్, మేఘా శెట్టి జత కడుతుండగా సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా రూపొందుతోంది. ఇటీవల ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రానికి అద్భుతమైన చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించి సంగీత ప్రియులను అలరించిన డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ ద్వయం వివేక్ మరియు మెర్విన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కేవిఎన్ ప్రొడక్షన్స్  లో జనగణమన, మెగా 158 ఉన్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించడం తథ్యం.

 

ntr, narne nithiin, kvn productions, meghashetty



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments