HomeEntertainmentRao bahadur: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రావు బహదూర్.. మూడురోజులకి ఎంతంటే!

Rao bahadur: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రావు బహదూర్.. మూడురోజులకి ఎంతంటే!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


Rao bahadur: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రావు బహదూర్.. మూడురోజులకి ఎంతంటే!

Jul 6, 2026 11:30AM

 

 

కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షక పట్టాభిషేకం ఎలా ఉంటుందో నిరూపిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్నాడు రావు బహదూర్. సత్యదేవ్ విలక్షణ నటన, క్రేజీ డైరెక్టర్ వెంకటేష్  దర్శకత్వ ప్రతిభకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన    ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులని  సృష్టిస్తోంది. 

 
మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 3.11 కోట్లు రాగా రెండు రోజుల్లోనే 5 కోట్ల మార్కుని అందుకుంది. మూడో రోజైన ఆదివారం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. ఓవర్సీస్ లోను అదే పరిస్థితి. దీంతో మూడు రోజుల  వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్  8.52 కోట్ల మార్కుని  తాకి సంచలనం సృష్టించింది.  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ సినిమా అత్యధికంగా 2.80 కోట్ల వసూళ్లను సాధించి టాప్ ప్లేస్‌లో నిలవగా కర్ణాటకలో 33 లక్షలు, తమిళనాడులో 2 లక్షల కలెక్షన్లని  రాబట్టింది. 

Also read: పెళ్లి రోజు గిఫ్ట్ అంటు విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్ 

ప్రసిద్ధ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. సత్యదేవ్ నటించలేదని, జీవించాడని కొనియాడారు. ఈ సినిమా మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేయడం సినిమాకి  మరింత ప్లస్ అయింది. సత్యదేవ్ ఈ లుక్ కోసం ఏకంగా 70 రోజుల పాటు ప్రతిరోజూ 5 గంటల పాటు మేకప్ వేసుకోవడం ఆయన పడ్డ కష్టానికి, సినిమాపై ఉన్న అంకితభావానికి నిదర్శనం. ప్రస్తుతం ఈ సినిమా వీక్‌డేస్‌లోనూ మంచి హోల్డ్‌తో దూసుకుపోతోంది. హీరోయిన్ దీపా థామస్ పెర్ఫార్మ్ కి కూడా ప్రేక్షక లోకం బ్రహ్మ రధం పడుతుంది

 



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments