HomeEntertainmentAkhil Akkineni: సమంతపై అఖిల్ షాకింగ్ కామెంట్స్!

Akhil Akkineni: సమంతపై అఖిల్ షాకింగ్ కామెంట్స్!

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY


Akhil Akkineni: సమంతపై అఖిల్ షాకింగ్ కామెంట్స్!

Akhil Akkineni: టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీలో సరైన కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్.. లెనిన్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా మరో వారం రోజుల్లో అంటే జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అఖిల్ ఇంటర్వ్యూలో, ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. అయితే ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్కినేని అఖిల్‌కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా చూశారా? అడగగా.. అఖిల్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడం వల్ల ఇంకా పూర్తి సినిమా చూడలేదని చెప్తూనే.. సమంతపై అఖిల్ కురిపించిన ప్రశంసలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

తాను సినిమా మొత్తం చూడకపోయినప్పటికీ.. ఇప్పటివరకు చూసిన విజువల్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అక్కినేని అఖిల్ వెల్లడించాడు. ముఖ్యంగా ‘మా ఇంటి బంగారం’ సినిమా ట్రైలర్, వైబ్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని అఖిల్ ప్రశంసించడం విశేషం. ఓ పక్క ‘మా ఇంటి బంగారం’ లాంటి క్లాసిక్ టైటిల్ పెట్టి.. మరోపక్క సమంతను పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో చూపించడం ఓ చక్కటి క్రియేటివ్ ఆలోచన అని మెచ్చుకున్నాడు. అంతే కాకుండా యాక్షన్ సీక్వెన్స్‌లలో సమంత యాక్టింగ్, ఆమె పడిన కష్టం నిజంగా అభినందనీయమంటూ అఖిల్ ప్రత్యేకంగా కొనియాడాడు.

Akhil Akkineni Makes Surprising Comments on Samantha Maa Inti Bangaaram Movie Full Details

నిజానికి అక్కినేని అఖిల్‌కు ప్రస్తుతం ఈ ‘లెనిన్’ చిత్రం విజయం అత్యంత కీలకం. వరుసగా ఆరు సినిమాలకు పైగా సరైన కమర్షియల్ హిట్ లేకపోవడంతో మాస్ హీరోగా తన భవిష్యత్తును నిరూపించుకోవడానికి అక్కినేని అఖిలే ఈ ప్రాజెక్టుపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తని సినిమా ప్రమోషన్లలో ఉంటూనే.. సమంత సినిమా గురించి అఖిల్ అంత సానుకూలంగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వారైన అక్కినేని అఖిల్.. సమంత సినిమాపై ఇలా ఓపెన్‌గా పాజిటివ్ కామెంట్స్ చేయడంతో అక్కినేని అఖిల్, సమంత అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నాగచైతన్యతో విడాకుల అనంతరం కూడా సమంతతో అఖిల్ మెయింటైన్ చేస్తున్న బాండింగ్ ఈ ప్రశంసలను మరింత ప్రత్యేకం చేసింది.

సమంతం ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ బ్లాక్‌బస్టర్ హిట్‌తో దూసుకుపోతుండగా.. అఖిల్ మాత్రం ‘లెనిన్’ సినిమాతో హిట్ కొట్టాల్సిన తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి తరుణంలో సమంతపై అఖిల్ చేసిన కామెంట్స్ కేవలం ఓ సాధారణ ప్రశంసలా కాకుండా.. అంతకు మించిన ఎమోషనల్ బాండింగ్‌ను చూపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విడాకుల వల్ల ఎంత విభేదాలు వచ్చినా.. అక్కినేని కుటుంబంలో కనీసం ఒక వర్గం నుంచి సమంతకు ఇంకా ఆత్మీయత, మద్దతు లభిస్తున్నాయనడానికి అఖిల్ చేసిన ఈ కామెంట్స్ ఉదాహరణగా నిలిచాయి.

ఇక అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా విషయానికి వస్తే.. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అక్కినేని అఖిల్ మాస్ అండ్ రగడ్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. మోస్ట్ అవేటెడ్ ‘లెనిన్’ మూవీ జులై 10వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments