HomeNewsమార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ గా 'సైయద్ నవాజ్'

మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ గా ‘సైయద్ నవాజ్’

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్‌గా సైయద్ నవాజ్ నియామకం
  •  పూర్తి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగింపు: చైర్మన్ పట్లోళ్ల నర్సింలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్‌గా సైయద్ నవాజ్ గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులను అందుకున్నారు.  ఇంతకు ముందు అంతారం పంచాయతీ లో ఉన్నటటువంటి భాగ్వాన్   కరీం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన స్థానం లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారం తో డైరెక్టర్ పదవిని సైయద్ నవాజ్ ను నియమించారు. సైయద్ నవాజ్ ఈ పదవిలో పూర్తి రెండేళ్ల పాటు కొనసాగుతారని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ… మార్కెట్ కమిటీ గడువు లేదా కమిటీ పునర్వ్యవస్థీకరణలో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినప్పటికీ, సైయద్ నవాజ్ మాత్రం డైరెక్టర్‌గా పూర్తి రెండేళ్ల సమయం పాటు పదవిలో కొనసాగుతారని తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి, స్థానిక రైతుల సమస్యల పరిష్కారానికి నూతన డైరెక్టర్ సంపూర్ణంగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా సైయద్ నవాజ్ నియమితులైన సందర్బంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీల నాయకులు, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు అభిమానులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తన నియామకానికి సహకరించిన పెద్దలకు, చైర్మన్‌కు సైయద్ నవాజ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments