HomeEntertainmentఇండిపెండెన్స్ డే వేడుకల్లో మెరిసిన త్రిష కృష్ణన్.. నెట్టింట షేక్ చేస్తున్న విజయ్ ఫోటోలు!

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మెరిసిన త్రిష కృష్ణన్.. నెట్టింట షేక్ చేస్తున్న విజయ్ ఫోటోలు!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY


ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మెరిసిన త్రిష కృష్ణన్.. నెట్టింట షేక్ చేస్తున్న విజయ్ ఫోటోలు!

Aug 15, 2026 3:53PM

కోలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో దళపతి విజయ్, చార్మింగ్ బ్యూటీ త్రిషల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపైనే కాకుండా బయట కూడా వీరిద్దరి బాండింగ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే నిలుస్తుంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ ఇద్దరూ కలిసి కనిపించిన ఒక అరుదైన దృశ్యం ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ అధికారిక వేడుకకు నటి త్రిష కృష్ణన్ ప్రత్యేకంగా హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. పసుపు రంగు సాంప్రదాయ చీరకట్టులో మెరిసిన త్రిష, ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే.. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్‌ల పక్కనే త్రిష కూర్చుని కనిపించడం. విజయ్ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్న సమయంలో త్రిష ఆయనకు గౌరవంగా సెల్యూట్ చేస్తూ, చిరునవ్వులు చిందించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

విజయ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ కనిపించిన త్రిష, ఇప్పుడు అధికారిక వేడుకల్లో విజయ్ కుటుంబసభ్యుల చెంతనే మెదలడం కోలీవుడ్ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ పిక్స్ చూసిన అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ చేస్తున్నారు. విజయ్-త్రిషల అరుదైన బాండింగ్‌ను కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Vijay Trisha viral photo, Thalapathy Vijay, Independence Day, Trisha Krishnan CM Vijay salute, Tamil Nadu Independence Day celebrations 2026 



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments