HomeNewsనగదు కష్టాలు తీర్చేలా నూతన ఏటీఎం...!

నగదు కష్టాలు తీర్చేలా నూతన ఏటీఎం…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • గౌతపూర్‌లో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ప్రారంభం
  • ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మండలం గౌతపూర్ గ్రామంలో స్థానిక ప్రజల నగదు అవసరాల నిమిత్తం నూతనంగా ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కేంద్రాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఏటీఎంను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ ఏటీఎంను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అత్యవసర సమయాల్లో నగదు ఉపసంహరణ కోసం దూరప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు ఇకపై స్థానిక ప్రజలకు తప్పుతాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, స్థానిక గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments