HomeNewsనాకు ప్రాణహాని ఉంది...!

నాకు ప్రాణహాని ఉంది…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • నాపై దాడికి ప్లాన్ చేశారు 
  • భయంతోనే మా పార్టీ నాయకులను పిలిచాను 
  • కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు 
  • మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి 

జనవాహిని ప్రతినిధి తాండూరు :  నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపాలని చూస్తున్నారు ఎదో ఒక రకంగా నన్ను టార్గెట్ చేసి నాపై దాడి చేసేందుకు, నాపై ఎస్సి, ఎస్టీ కేసులు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని… మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గురువారం కొడంగల్ రోడ్డు మార్గం లోని సర్వే నెంబర్ 212 లోని 28వ ఫ్లాట్ విషయం లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య భూవివాదం నెలకొంది. ఐతే పాత తాండూరు కు చెందిన ఈ స్థలం.. గతంలో శామ్ సుందర్ అని వ్యక్తి కొనొగులు చేశారు.కొద్దీ రోజుల తర్వాత శామ్ సుందర్ జాకిర్ లాల అనే వ్యక్తి కి విక్రాయించాడు. ఏ వ్యక్తి నుండి శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు చేసి ప్రస్తుతం.. రెడ్డి చికెన్ సెంటర్ యజమాని యాది రెడ్డి కి అమ్మేసారు. ఐతే వరాల శ్రీనివాస్ రెడ్డి యాది రెడ్డి కి స్థలం విక్రయించే ముందు అయన దగ్గర పని చేసే ఓ మేకల కాపరి కోసం ఆ స్థలం లో షెడ్ నిర్మాణం చేసి ఇచ్చారు. గురువారం కొందరు కాంగ్రెస్ నాయకులు దొంగ డాక్యుమెంట్ లను తీసుకొచ్చి ప్లాట్ నెంబర్ పార్ట్ గా చూపిస్తూ.. ఆ స్థలం వారిదే నని షెడ్ ను అన్యాయంగా కూల్చేసారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కావాలనే షెడ్ ను కూల్చేసి.. 212 సర్వే నెంబర్ గల స్థలాన్ని కాబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం లోనే తనపై దాడి చేసేందుకు కూడా కాంగ్రెస్ నాయకులు ప్లాన్ చేసారని అన్నారు. ఈ భువివాదం కాస్త పోలీస్ స్టేషన్ కు చేరింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments