HomeNewsవిద్యుత్ షాక్‌తో రైతు కూలీ మృతి..!

విద్యుత్ షాక్‌తో రైతు కూలీ మృతి..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • అజ్మత్ అనే వ్యక్తి పొలంలో పనులకు వెళ్లి ఘటన
  •  జింగుర్తి గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు.
  • శోకసంద్రంలో మృతుడి కుటుంబం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మండల పరిధిలోని జింగుర్తి గ్రామంలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన ఓ రైతు కూలీ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జింగుర్తి గ్రామానికి చెందిన తుంగల జగన్ (50, తండ్రి: అంతప్ప) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన అజ్మత్ అనే రైతు పొలంలో పనుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. దీంతో జగన్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.ఉదయం పని కోసం ఆరోగ్యంగా ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి, కొద్ది గంటల్లోనే విగతజీవిగా మారడంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జగన్ మృతితో జింగుర్తి గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments