HomeEntertainmentదిక్కులేని స్థితిలో రోడ్డు పక్కన పడుకున్న జబర్దస్త్ కమెడియన్..! వైరల్ వీడియో..

దిక్కులేని స్థితిలో రోడ్డు పక్కన పడుకున్న జబర్దస్త్ కమెడియన్..! వైరల్ వీడియో..

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY


దిక్కులేని స్థితిలో రోడ్డు పక్కన పడుకున్న జబర్దస్త్ కమెడియన్..! వైరల్ వీడియో..

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షోస్ లో ‘జబర్దస్త్’ ఒకటి. దాదాపు 13 ఏళ్లుగా ఈ ప్రోగ్రామ్ కోట్లాదిమంది బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. అలాగే సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ లోనూ తెగ పాపులర్ అయింది. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు స్టార్ కమెడీయన్లుగా మారారు. పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, ఆటో రామ్ ప్రసాద్, రాకెట్ రాఘవ, బుల్లెట్ భాస్కర్ ఇలా అనేకమంది కమెడియన్లు ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యారు.

జబర్దస్త్ లో నటించిన వాళ్లు ఎవరూ కెరీర్ పరంగా ఫెయిల్ కాలేదని చెప్పొచ్చు. అటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోతోనూ అనేక మంది కొత్తవాళ్లు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అయితే వారిలో కొందరు కమెడియన్లు మాత్రం సరైన అవకాశాలు లేక తెగ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో నవదీప్ ఒకరు.. హైపర్ ఆదితో పాటు అనేక మంది స్టార్ కమెడియన్స్ తో స్కిట్ లు చేసిన ఆయన ఇప్పుడు దీన స్థితిలో రోడ్డు పక్కన పడుకుని ఉన్నాడు. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక.. ఇలా దిక్కుతోచని స్థితిలో ఆయన గడపడాన్ని చూసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Jabardasth comedian Navdeep found lying helplessly by the roadside Viral video Jabardasth show

కమెడియన్ నవదీప్ ను కొందరు గుర్తుపట్టి వీడియో తీసేందుకు ప్రయత్నించారు. అందుకు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీడియో తియ్యకు పో అని కోప్పడ్డాడు. దానికి ఓ వ్యక్తి .. నిన్ను శ్రీదేవి డ్రామా కంపెనీలో చూశాను.. ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగాడు.. అందుకు అతను సమాధానం ఇస్తూ.. ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. కానీ ఆమె నన్ను మోసం చేసింది. రూ. 30 లక్షలు ఉండేవి నా దగ్గర.. మొత్తం నగదును ఐపీఎల్ లో పోగొట్టుకున్నాను. ఇప్పుడు తినడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు.. అని ఆ వీడియోలో వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.

అయితే ఈ వీడియో చూసిన వాళ్లు మాత్రం.. ఇదంతా స్కిట్ లో భాగంగానే జరిగిందని.. ఎక్కడో ప్లాన్ చేసుకొని షూట్ చేసినట్టుగా ఉందని, సహజంగా అసలు లేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి నవదీప్ నిజంగా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడా..? లేదంటే నటిస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments