HomeNewsజయశంకర్ విగ్రహానికి ‘ఫ్లెక్సీ’ల గ్రహణం..!

జయశంకర్ విగ్రహానికి ‘ఫ్లెక్సీ’ల గ్రహణం..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు ఇందిరా చౌరస్తాలో ఫ్లెక్సీ పంచాయతీ 
  • మహనీయుడి విగ్రహం మూసివేతపై ఉద్యమకారుల ఆగ్రహం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి తాండూరు పట్టణంలో అవమానం జరిగింది. తమ స్వంత ప్రచార ఆర్భాటాల కోసం ఏకంగా ఒక మహనీయుడి విగ్రహాన్ని ఫ్లెక్సీలతో కప్పేయడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఇందిరా చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఉంది. అయితే, ఈ విగ్రహం చుట్టూ ఇష్టారాజ్యంగా రాజకీయ, ప్రైవేట్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ భారీ ఫ్లెక్సీల కారణంగా జయశంకర్ విగ్రహం అసలు ఎక్కడుందో కూడా గుర్తుపట్టలేనంతగా పూర్తిగా మూసుకుపోయింది.తమ ఫ్లెక్సీల ప్రదర్శన కోసం తెలంగాణ జాతి గర్వించదగ్గ మహనీయుడి విగ్రహాన్ని ఇలా చాటున పెట్టడంపై పలువురు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, స్థానిక యంత్రాంగం కళ్ళుండీ కంటితుడుపుగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన జయశంకర్ సార్ విగ్రహాన్ని ప్రచార పిచ్చితో అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విగ్రహం చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో విగ్రహాల పరిసరాల్లో ఫ్లెక్సీలు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments