HomeNewsఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ ...!

ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్ …!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు.
  •  తాండూరు జంట మహిళల హత్య కేసు నిందితురాలి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎస్పీ సీరియస్
  •  బషీరాబాద్ మహిళా కానిస్టేబుల్ సునీత, యాలాల కానిస్టేబుల్ బసవరాజుపై చర్యలు

తాండూరు, జనవాహిని ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన తాండూరు జంట మహిళల దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరిమాబి పోలీస్ నిఘాలో ఉండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.సస్పెన్షన్‌కు గురైన వారిలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ సునీత, యాలాల పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బసవరాజు ఉన్నారు.తాండూరుకు చెందిన ఇద్దరు వృద్ధులు జంట హత్య కేసులో నిందితురాలైన కరిమాబిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో ఆమెకు భద్రతగా, నిఘా ఉంచేందుకు బషీరాబాద్‌కు చెందిన సునీత, యాలాలకు చెందిన బసవరాజులను బందోబస్తుగా నియమించారు. అయితే, విధుల్లో ఉన్న సదరు కానిస్టేబుళ్లు ఇద్దరూ తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో, వారి కళ్లు గప్పి నిందితురాలు కరిమాబి పోలీస్ కస్టడీలోనే ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది.సమయానికి స్పందించిన ఇతర సిబ్బంది ఆమెను కాపాడినప్పటికీ.. నిందితురాలి భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ సునీత, బసవరాజులపై ప్రాథమిక విచారణ జరిపి, ఎస్పీ ఈ సస్పెన్షన్ వేటు వేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments