HomeTelanaganahyderabadయువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి..!

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో వైభవంగా ‘హౌస్ ఆఫ్ ఛాంప్స్’ జిమ్ పోటీలు
  • విజేతలకు బహుమతులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

జానవాహిని ప్రతినిధి తాండూరు: యువత మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉంటూ, దేహదారుఢ్యం, వ్యాయామంపై దృష్టి సారించాలని ఆర్బిఓఎల్ సీఈఓ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
స్థానిక తాండూరు పట్టణంలో హౌస్ ఆఫ్ ఛాంప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్, జిమ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.
పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులను శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేసి, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అంతకుముందు, ‘హౌస్ ఆఫ్ ఛాంప్స్’ జిమ్ యజమాని పట్లోళ్ల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ని శాలువా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments