- విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులు
- తల్లిదండ్రలకు కూడా లేని ఎంట్రీ
- ఉపాధ్యాయుల వ్యవహారం పై కలెక్టర్ కు పిర్యాదు
జనవాహిని ప్రతినిధి తాండూరు;విద్యార్థులు తల్లీ తండ్రులను వదిలి గురుకుల పాఠశాలలో ఉంటున్నారు అనే ఆలోచన కూడా లేకుండా. …సాంఘిక సంక్షేమ పెద్దేముల్ బాలుర పాఠశాలలో ఉపధ్యాయులు మొండిగా వ్యవహారిస్తున్నారు. పాఠశాలలో ఉంటున్న విద్యార్థులను తమ సొంత బిడ్డలగా చూసుకోవల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల చెత్త వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. విద్యార్థలతో వంట చేయించడం,బాత్రూం లు కడిగించడం లాంటి పనులు చేయిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చెపుతున్నారు. సెలవు రోజు అయినా ఇతర రోజుల్లో తన పిల్లలను చూడాలని పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులను లోపలికి అనుమతించకుండా తమ పిల్లలను కలవకుండా నిరాశ పరుస్తున్నారు. ఇదే క్రమంలో తాండూర్ సమింలోని పెద్దేముల్ కు చెందిన సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు మంటను కాల్చి వాతలు పెట్టారు. ఈ విషయం పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయులకు బాధిత విద్యార్ధి తెలిపిన అలాంటివి ఇక్కడ కామన్ నువ్వు లైట్ తీసుకో అంటూ జవాబుయిచ్చారు. ఇదే విషయం ఆ విద్యార్ధి తన తల్లికి చెప్పాడు. దింతో అసలు ఆ పాఠశాలలో ఎం జరుగుతుందో కనుకుందాం అని వచ్చిన విద్యార్ధి కుటుంబ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. అసలు విషయాలు ఇక్కడే బయటపడ్డాయి. ఇది మొదటి సారి కాదట, రోజు ఇదే తరహాలో గురుకుల పాఠశాల విద్యార్థులు తోటి విద్యార్థులను చిత్రహింసలు పెట్టడం,కొట్టడం, కాల్చడం వంటి పనులు చేస్తున్నారని తెలిసింది. ఓ పక్క విద్యార్థులు కొట్టుకొని తల్లిదండ్రలకు సమాచారం ఇచ్చిన, మరో పక్క ఉపాధ్యాయులు మాత్రం ఏమాత్రం …. బాధ్యత లేకుండా పిల్లలను, తల్లిదండ్రులకు సమాధానం ఇవ్వడం పక్కన పెడితే కనీసం పాఠశాలకు ఉన్న గేట్ కూడా తియ్యకుండా మొహం చాటేస్తున్నారు. దాదాపు 4 గంటల సమయం తర్వాత తల్లిదండ్రులు గొడవ చెయ్యడం తో విషయం కాస్త పోలీసుల వరకు చేరింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ… మా పిల్లలను ఉపాధ్యాయుల పై నమ్మకం తో హాస్టల్ లో వదిలి మా పని మేము చేసుకుంటున్నాము కానీ ఇక్కడ మా పిల్లలను టీచర్స్ అసలు పట్టించుకోవడమే లేదని అన్నారు. తమ పిల్లలు తినే అన్నం లో కూడా పురుగులు వస్తున్నాయని చెప్పిన అదే అన్నం వడ్డీస్తున్నారని వపోయారు. తోటి విద్యార్థులు కొట్టుకొని కాల్చుకున్న నిర్లక్షపు సమాధానం ఇస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం అని జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్నీ తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే అసలు విషయం ఇక్కడే బయటపడింది. సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ అసలు పాఠశాలలోనే ఉందరట. కనీసం వారం లో 2 రోజులు కూడా పాఠశాలకు రారని, ఆయనతో పాటు వైస్ ప్రిన్సిపల్ కూడా అదే తరహాలో ఉంటారని సమాచారం. స్థానికంగా ఉన్న టీచర్స్ అసలు విద్యార్థులను పట్టించుకునే దిక్కు లేదని విద్యార్థులు కూడా చెప్పారు. ఈ గురుకుల పాఠశాల ఇప్పటికే ఎన్నో మార్లు వివాదానికి గురైంది. మరో సారి వివాదం లోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులను గాలికి వదిలేసి ఇష్టరాజ్యం గా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రిన్సిపల్, బృందం ను సస్పెండ్ చెయ్యాలని పలువురు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తోనే గురుకుల పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇష్టం వచ్చినట్టు వ్యవహారిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
