- తాండూరులో హిందూ ఉత్సవ సమితి ఫ్లాట్, చందాల లెక్కలపై వివాదం
- భాహిరంగంగా అన్ని చూపించాలని డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు హిందూ ఉత్సవ సమితి డబ్బులతో కొన్న ఫ్లాట్ ఎక్కడ ఉందో చూపించాలని, అలాగే గతంలో 4 సార్లు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో వసూలు చేసిన చందాల లెక్కలను వెంటనే బహిరంగంగా వెల్లడించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పట్లోళ్ల నర్సిములుపై, హిందూ ఉత్సవ ప్రధాన కార్యదర్శి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు ను తాండూరు మున్సిపల్ 10వ వార్డు అల్లాపూర్ కౌన్సిలర్, హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా ఓ ప్రకటనలో అల్లాపూర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… హిందూ ఉత్సవ సమితి డబ్బులతో కొన్న ఫ్లాట్ ఎక్కడ ఉందొ చూపించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సిములు ను ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. అయితే ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో ఇప్పటివరకు చూపించలేదని మండిపడ్డారు. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సిములు 4 సార్లు హిందూ ఉత్సవ సమితికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తింస్తున్నారని గుర్తుచేశారు. ఆ సమయంలో తాండూరు లో ఎంత మొత్తంలో చందాలు వసూలు చేశారు? ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత డబ్బు మిగిలి ఉందనే వివరాలను ఇప్పటి వరకు కమిటీకి కానీ, ప్రజలకు కానీ చూపించలేదని ఆరోపించారు.
గతంలో ప్రతిసారి లెక్కల గురించి ప్రశ్నించినప్పుడు అన్నీ చూపిస్తాం అని చెప్పడమే తప్ప, ఏ రోజు కూడా పారదర్శకంగా వివరాలు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెల రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నందున, ఉత్సవాల సమర్థవంతమైన నిర్వహణకు గాను నూతన కమిటీని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హిందూ ఉత్సవ సమితికి ఇస్తామన్న ఫ్లాట్ వివరాలతో పాటు, గతంలో వసూలు చేసిన విరాళాలు, ఖర్చులకు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రజల సమక్షంలో బహిరంగంగా ప్రదర్శించాలని అల్లాపూర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు.
