HomeTelanaganahyderabadవైద్యం పేదలకు భారం కాకూడదు...!

వైద్యం పేదలకు భారం కాకూడదు…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూర్ 8వ వార్డులో రూ.10లకే ప్రత్యేకాస్పత్రి వైద్యం!
  • ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ జావీద్
  • ఉచితంగా ల్యాబ్ పరీక్షలు, మందుల పంపిణీ

జానవాహిని ప్రతినిధి తాండూరు: వైద్యం రోజురోజుకూ ఖరీదవుతున్న ఈ రోజుల్లో, పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి న్యూ లోటస్ హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ అన్నారు. తాండూర్ పట్టణంలోని 8వ వార్డులో న్యూ లోటస్ హాస్పిటల్ యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ నట్లాడుతూ ప్రస్తుతం చిన్న జలుబు, జ్వరానికి ఆసుపత్రికి వెళ్లినా రూ.300 వరకు ఫీజులు వేస్తూ, వేల రూపాయల మందులు రాసి ప్రజలను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాండూర్ లారీ పార్కింగ్ వద్ద ఉన్న న్యూ లోటస్ హాస్పిటల్ ఎండీ మాణిక్యం మరియు వారి డాక్టర్ల బృందం ప్రతిరోజూ కేవలం ₹10లకే ఓపీ సేవలు అందించడం గొప్ప విషయమన్నారు.
ఈ శిబిరంలో స్త్రీల వైద్య నిపుణులు, పిల్లల వైద్యులతో పాటు వివిధ విభాగాల డాక్టర్లు రోగులను పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశారు.
తాండూర్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిరుపేదలకు సేవ చేస్తున్న డాక్టర్ల బృందాన్ని కాలనీవాసుల తరఫున కౌన్సిలర్ జావీద్ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments