- తాండూరు ప్రగతిపై ఉప ముఖ్యమంత్రితో చర్చ
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు: నయీమ్ ఆఫూ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను తాండూర్ కాంగ్రెస్ నాయకులు నయీమ్ ఆఫు మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధి, మున్సిపల్ పరిధిలోని మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నయీమ్ ఆఫూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలను నయీమ్ ఆఫూ ఉప ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతున్న పనులకు ప్రభుత్వ పరంగా పూర్తి మద్దతు ఉండాలని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి, పెండింగ్ పనుల వేగవంతానికి సహకరించాలని కోరారు. తాండూరు సమగ్రాభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
#Tandur #TandurCongress #ManoharReddy #BhattyVikramarka #TelanganaDevelopment #TandurNews #TandurProgress #CongressParty #TelanganaPolitics #TandurMLA #DevelopmentGoals




