Home News మరిన్ని సేవలు అందించాలి…!

మరిన్ని సేవలు అందించాలి…!

123
0
  • తాండూరులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం విజయవంతం
  • సుమారు 300 మందికి పైగా నిరుపేదలకు ఉచితంగా పరీక్షలు
  • డాక్టర్ జై ప్రసాద్‌ను ఘనంగా సన్మానించిన తాండూరు యువకులు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని సాయి తరుణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వేదికగా ఆదివారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మరియు అవగాహన కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. కిమ్స్ సికింద్రాబాద్ మరియు తాండూర్ ఐ.ఎం.ఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా నిరుపేద ప్రజలు పాల్గొని ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా…. యువకులు మాట్లాడుతూ…. తాండూరు లోని పేదలకు డాక్టర్ జై ప్రసాద్‌ అందిస్తున్న సేవలను కొనియాడారు. భవిష్యత్ లో కూడా తాండూరు ప్రాంత ప్రజల కోసం ఎల్లప్పుడూ ఇలాంటి సేవలు అందించాలని కోరారు. సామాజిక బాధ్యతతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గాను డాక్టర్ జై ప్రసాద్ ను తాండూరు యువకులు ఘనంగా సన్మానించారు. ఆయన చేస్తున్న వైద్య సేవలను కొనియాడారు.భవిష్యత్తులో కూడా తాండూరు ప్రాంత ప్రజల కోసం ఐ.ఎం.ఏ ఆధ్వర్యంలో ఇలాంటి మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాలని తాండూరు యువత ఈ సందర్భంగా కోరారు. వైద్యం సామాన్యుడికి చేరువ కావడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది మరియు స్థానిక   యువకులు  పరియాదా రామకృష్ణ , రజినీకాంత్, టైలర్ రమేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here