spot_img
HomeEntertainmentహీరోగా మారిన స్టార్ డైరెక్టర్ "రామ్ గోపాల్ వర్మ".. 2027 సంక్రాంతికి రిలీజ్ !!

హీరోగా మారిన స్టార్ డైరెక్టర్ “రామ్ గోపాల్ వర్మ”.. 2027 సంక్రాంతికి రిలీజ్ !!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


హీరోగా మారిన స్టార్ డైరెక్టర్ “రామ్ గోపాల్ వర్మ”.. 2027 సంక్రాంతికి రిలీజ్ !!

రామ్ గోపాల్ వర్మ.. ఈ సంచలన దర్శకుడి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా “శివ” చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. 1990లో విడుదల అయిన ఈ మూవీ తెలుగు సినిమాల్లో కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఆ తర్వాత ‘క్షణక్షణం’, ‘గాయం’, ‘రాత్రి’, ‘అంతం’ వంటి సినిమాలతో ఆడియన్స్ ని టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చిన ఆర్జీవీ.. 1998లో ‘సత్య’ చిత్రంతో హిందీ ఆడియన్స్ ని పలకరించారు. ఆ మూవీతోనే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అలానే ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘కంపెనీ’, ‘రోడ్’, ‘రన్’, ‘సర్కార్’ వంటి చిత్రాలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్‌తో తీసిన ‘సర్కార్’ ఆయన కెరీర్‌లో ఒక హైలైట్‌గా నిలిచింది.

director-ram-gopal-varma-as-lead-role-in-new-movie-titles-as-show-man-and-photos-goes-full-viral-on

కాగా అటు సినిమాల తోనే కాకుండా వివాదాల తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తారు ఆర్జీవీ. సోషల్ మీడియాలోనూ, టీవి ఇంటర్వ్యూల లోనూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా, ఓపెన్ గా వ్యక్తపరుస్తూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఇక గత కొంతకాలంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడు లాగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటున్నారు.

అయితే ఎప్పుడూ తెర వెనుకే ఉండే వర్మ.. ప్రభాస్ – నాగ్ అశ్విన్ “కల్కి” సినిమా కోసం మాత్రం అతిథి పాత్రలో తెర మందుకు వచ్చారు. ఉన్నది కొంచెం సేపు అయినా కూడా తన మార్క్ మేనరిజంతో అలరించారు. కానీ ఇప్పుడు ఏకంగా కంప్లీట్ గా రూట్ మార్చేశారు ఆర్జీవీ. దీంతో ఈ వ్యవహరం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

హీరోగా వర్మ..

రామ్ గోపాల్ వర్మ హీరోగా సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి “షో మ్యాన్” అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. “మ్యాడ్ మోన్‌స్టర్ ” అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అంతే కాకుండా నటుడు సుమన్ ఈ మూవీలో విలన్‌గా చేయబోతుండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాతో “నూతన్” అనే కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన.. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఈ కొత్త సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని.. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments