- భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న లక్ష్మణాచారి బృందం
జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలాల మండల బిసి సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి మరియు వారి మిత్ర బృందం శబరిమల యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు.ఈ యాత్రలో భాగంగా వారు కేరళలోని ప్రకృతి అందాలతో పాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించారు. మున్నార్ అందాలను వీక్షించడంతో పాటు, అజ్మలై టెంపుల్, పార్వతి దేవి ఆలయం, కోవలం బీచ్ మరియు గోల్డ్ సాండ్ ఐలాండ్ ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్‌ను దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో లక్ష్మణాచారితో పాటు లెక్చరర్ మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం సభ్యులు నరేందర్, అంజి, గోపికృష్ణ, శివకుమార్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







