Wednesday, May 27, 2026

― Advertisement ―

అంగన్వాడీ పంపిణీలో ‘నిర్లక్ష్య’పర్వం…!

సకాలంలో అందని రేషన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నసాగర్ గ్రామస్తులు టీచర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా, యాలాల మండలంలోని అన్నసాగర్ గ్రామంలో అంగన్వాడీ...
HomeNEWSరాజకీయ ఆర్భాటాలు వద్దు.. ప్రజా సేవే ముద్దు

రాజకీయ ఆర్భాటాలు వద్దు.. ప్రజా సేవే ముద్దు

spot_img
  • ప్రజల ముంగిట ‘ రూప రుద్రు పటేల్’
  •  సొంత ఖర్చుతో వార్డులో పనులు 
  •  5 రోజులుగా నీటి ఎద్దడి.. ట్యాంకర్లతో దాహం తీర్చిన కౌన్సిలర్
  • 3 రోజుల్లోనే 16 వీధి దీపాల ఏర్పాటు.. ప్రజల హర్షం

జనవాహిని ప్రతినిధి తాండూరు : పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటూ, సమస్య ఏదైనా తక్షణమే స్పందించే వారికే ప్రజలు బ్రహ్మరథం పడతారని తాండూరు మున్సిపల్ పరిధిలోని 36వ వార్డు కౌన్సిలర్ రూప రుద్రు పటేల్ మరోసారి నిరూపించారు. పట్టణంలో గత ఐదు రోజులుగా మంచినీటి సరఫరాకు అంతరాయం కలగడంతో వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన, సోమవారం వార్డ్ లో లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ…. వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేశారు.కేవలం మంచినీటి సమస్యే కాకుండా, వార్డులో మౌలిక వసతుల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. గత మూడు రోజుల్లోనే వార్డులోని వివిధ వీధుల్లో వెలగని 16 స్ట్రీట్ లైట్లను కొత్తవి వేయించి పునరుద్ధరించారు. వార్డులో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గత వారం వార్డులో నూతనంగా బోరు వేయించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ప్రస్తుత నీటి ఎద్దడి సమయంలో ప్రజల దాహం తీర్చడంలో మాత్రం విఫలమయ్యారని వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్భాటాలకు పోకుండా, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడమే నిజమైన సేవ అని కౌన్సిలర్ నిరూపించారని వారు కొనియాడారు.36వ వార్డులో ఏ సమస్య ఉన్నా గంటల వ్యవధిలోనే స్పందిస్తూ, “ప్రజల మనిషి”గా పేరు తెచ్చుకుంటున్న రూప రుద్ర పటేల్ తీరు ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తోంది. మంచినీటి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని ఈ సందర్భంగా కౌన్సిలర్ హామీ ఇచ్చారు.