HomeBusinessఅంబరాన్నంటిన టాటా సంబరాలు.. సియెర్రాకు స్పెషల్ జూబ్లీ ఎడిషన్ వచ్చేసింది

అంబరాన్నంటిన టాటా సంబరాలు.. సియెర్రాకు స్పెషల్ జూబ్లీ ఎడిషన్ వచ్చేసింది

అంబరాన్నంటిన టాటా సంబరాలు.. సియెర్రాకు స్పెషల్ జూబ్లీ ఎడిషన్ వచ్చేసింది

టాటా మోటార్స్ తన ప్రతిష్టాత్మక సియెర్రా (Sierra) suvకి ప్రత్యేక గుర్తింపుగా జూబ్లీ ఎడిషన్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసింది. మార్కెట్లో ఈ మోడల్ 50,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని విజయవంతంగా అధిగమించిన సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. సియెర్రా అమ్మకాల విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఈ జూబ్లీ ఎడిషన్, సాధారణ మోడల్‌తో పోలిస్తే మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందించే ప్రత్యేక యాక్సెసరీలతో వస్తోంది. అయితే ఇది పూర్తిగా కొత్త వేరియంట్ కాదు. సియెర్రా లైనప్‌లో మరో ట్రిమ్‌ను జోడించకుండా, దానికి బదులుగా, ఇప్పటికే ఉన్న స్మార్ట్+, ప్యూర్, అడ్వెంచర్ ట్రిమ్‌ల ఆధారంగా ప్రత్యేక జూబ్లీ ఎడిషన్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ జూబ్లీ ఎడిషన్‌లు ఆయా స్టాండర్డ్ వేరియంట్‌ల కంటే మరింత ప్రీమియం లుక్‌ను అందించేలా రూపొందించబడ్డాయి. అయితే ఇంజన్, పనితీరు, భద్రత లేదా ప్రధాన ఫీచర్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ వేరియంట్‌లలో అందించే అదే ఇంజన్ ఆప్షన్‌లు, సేఫ్టీ ఫీచర్లు, టెక్నాలజీ, ఇతర ప్రధాన సౌకర్యాలు ఇందులో కూడా కొనసాగుతాయి. దీంతో కొత్త వేరియంట్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఇప్పటికే ఉన్న ట్రిమ్‌లలో వీటిని పొందచ్చు.

Tata Sierra Jubilee Edition Launched With Premium Accessory Pack In India

అంటే, కస్టమర్లు సియెర్రా వేరియంట్‌ను కొనుగోలు చేసి, డీలర్ వద్ద ఈ ప్రత్యేక యాక్సెసరీ ప్యాకేజీని అమర్చించుకోవచ్చు. దీంతో కారు రూపు మరింత ప్రీమియంగా, ప్రత్యేకంగా కనిపించడంతో పాటు, ఇతర సియెర్రా మోడళ్లతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపును కూడా సొంతం చేసుకుంటుంది. స్మార్ట్ ప్లస్ జూబ్లీ ఎడిషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక యాక్సెసరీ ప్యాకేజీలో టాటా మోటార్స్ అనేక ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్లను అందించింది.

ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్ యాడ్-ఆన్, టెయిల్‌గేట్ క్లాడింగ్, రూఫ్ రైల్స్ వంటి అంశాలు ఎస్‌యూవీకి మరింత బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తాయి. అలాగే క్యాబిన్‌లో సెమీ-లెదరెట్ సీట్ కవర్లు, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే రియర్ పార్కింగ్ కెమెరాను కూడా ఈ ప్యాకేజీలో అందించారు.

Tata Sierra Jubilee Edition Launched With Premium Accessory Pack In India

దీంతో నగరంలో డ్రైవింగ్, పార్కింగ్ మరింత సులభంగా ఉంటుంది. ఇక ప్యూర్ జూబ్లీ ఎడిషన్ మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా రూపొందించారు. ఇందులో పార్సెల్ ట్రే, వీల్ ఆర్చ్ క్లాడింగ్, మాగ్నెటిక్ సన్‌షేడ్స్, ఫ్రంట్ గ్రిల్ యాడ్-ఆన్, టెయిల్‌గేట్ క్లాడింగ్ వంటి అదనపు యాక్సెసరీలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రీమియం లెదరెట్ సీట్ కవర్లు, లెదరెట్ స్టీరింగ్ వీల్ కవర్ క్యాబిన్‌కు మరింత లగ్జరీ టచ్‌ను తీసుకువస్తాయి.

భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫ్రంట్, రియర్ డ్యాష్‌క్యామ్‌లు కూడా ఈ ప్యాకేజీలో అందించడం విశేషం. సాహసయాత్రలను ఇష్టపడే వారి కోసం టాటా అడ్వెంచర్ జూబ్లీ ఎడిషన్‌ను కూడా సిద్ధం చేసింది. ఇందులో కంపెనీ అధికారిక ROQ యాక్సెసరీ కిట్‌ను అందిస్తోంది. ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు ఉపయోగపడే ప్రత్యేక యాక్సెసరీలతో పాటు, ప్రయాణాలను రికార్డ్ చేసేందుకు ఫ్రంట్ డ్యాష్ కెమెరా‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

Tata Sierra Jubilee Edition Launched With Premium Accessory Pack In India

అయితే ఈ జూబ్లీ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీల ధరలను టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వినియోగదారులు తమకు నచ్చిన వేరియంట్‌కు అనుగుణంగా పూర్తి బండిల్ ప్యాకేజీని లేదా అవసరమైన యాక్సెసరీలను విడిగా కూడా డీలర్‌షిప్‌ల ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. వేరియంట్‌ల వారీగా ధరలు, లభ్యతపై పూర్తి సమాచారం త్వరలో టాటా డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments