HomeNewsబషీరాబాద్‌లో సిపిర్ అవగాహన శిబిరం..!

బషీరాబాద్‌లో సిపిర్ అవగాహన శిబిరం..!

  • ప్రాణాలను కాపాడే సంజీవని ‘సిపిఆర్’ 
  • కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన  
  •  భారీగా తరలివచ్చిన యువత, గ్రామస్తులు

జనవాహిని ప్రతినిధి తాండూర్ : తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన, శిక్షణ శిబిరం విజయవంతమైంది. అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ప్రాథమిక చికిత్స ద్వారా ఎలా కాపాడవచ్చో నిపుణులు ఈ శిబిరంలో ప్రత్యక్షంగా వివరించారు.హఠాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస నిలిచిపోయినప్పుడు వైద్య సాయం అందేలోపు చేయాల్సిన ‘సిపిఆర్’ ప్రక్రియను నిపుణులు శిక్షణార్థులకు చేసి చూపించారు. గ్రామానికి చెందిన యువత, విద్యార్థులు, పెద్దలు ఈ శిక్షణను ఎంతో ఆసక్తిగా నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఈ ప్రాథమిక చికిత్సపై అవగాహన ఉండటం సామాజిక బాధ్యత అని, భవిష్యత్తులో నియోజకవర్గవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఆత్మ చైర్మన్ శంకర్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం యాదవ్, మహిళా నాయకురాలు జానకి, వికారాబాద్ జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్ గౌడ్, సర్పంచ్ శాంతి బాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.కార్యక్రమంలో యువ నాయకులు జగదీష్, జైరామ్ చారి, శ్యామ్ రావు, ఎన్ఎస్ యూఐ నాయకులు షేక్ సైబాస్, సల్మాన్, నవీన్ కుమార్ గౌడ్, మధుసూదన్ గౌడ్, శ్రీనివాస్, రమేష్ దాదా, మొగులప్ప, స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు,యువకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments