HomeNewsరామకార్యంలో 'మహాలక్ష్మి' హాస్పిటల్ అధినేత..!

రామకార్యంలో ‘మహాలక్ష్మి’ హాస్పిటల్ అధినేత..!

  • శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి విరాళం
  •  ఆలయానికి ధ్వజస్తంభం, రూ. 2 లక్షల నగదు సమర్పణ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం ఇందిరా నగర్ లో నిర్మితమవుతున్న భవ్య రామమందిర పునర్నిర్మాణ మహాకార్యంలో భక్తులు తమవంతుగా భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ పి. జనార్దన్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. శ్రీరామ చంద్రునిపై ఉన్న అపారమైన భక్తితో ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాన్ని అందజేశారు.ఆలయానికి అత్యంత ప్రధానమైన ధ్వజస్తంభాన్ని విరాళంగా ఇవ్వడమే కాకుండా, దానికి సంబంధించిన విశేష పూజా కార్యక్రమాలను డాక్టర్ జనార్దన్ రెడ్డి స్వయంగా నిర్వహించనున్నారు.    ధ్వజస్తంభంతో పాటు, ఆలయ నిర్మాణ నిధి కోసం 2 లక్షల రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. లోకకళ్యాణం కోసం నిర్మితమవుతున్న రామమందిర నిర్మాణంలో భాగస్వామిని కావడం నా పూర్వజన్మ సుకృతంమన్నారు. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సేవగా భావిస్తున్నాను అని తెలిపారు.ఈ గొప్ప కార్యానికి పూనుకున్న డాక్టర్ జనార్దన్ రెడ్డిని పలువురు ప్రముఖులు, భక్తులు అభినందనలతో ముంచెత్తారు. ఆధ్యాత్మిక సేవలో ఆయన చూపుతున్న చొరవ అందరికీ ఆదర్శనీయమని వారు కొనియాడారు. అనంతరం రామ మందిర కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసారు. రామ మందిరం పునర్నిర్మాణానికి దాతలు తమ వంతుగా ముందుకు వచ్చి విరాళాలు సమర్పించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments