HomeNewsమౌలిక వసతుల కల్పనే లక్ష్యం..!

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • పల్లెల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..! 
  • బషీరాబాద్ మండలంలో రూ. 92 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • మైల్వార్, ఇస్మాయిల్ పూర్, ఎక్మాయ్ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ మండలంలో సుమారు రూ. 92 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఎమ్మెల్యే మొదటగా మైల్వార్ గ్రామంలో రూ. 11.20 లక్షలతో ప్రహరీ గోడ, రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు మరియు రూ. 10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనం పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఇస్మాయిల్ పూర్ గ్రామంలోని ఏకాంబరి దేవాలయం వద్ద రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు, రూ. 10 లక్షలతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎక్మాయ్ గ్రామంలో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు, రూ. 10 లక్షలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు రూ. 10.15 లక్షలతో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్గత రహదారులు, మహిళా భవనాలు మరియు విద్యా సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెను ఆదర్శ గ్రామంలా తీర్చిదిద్దుతామన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు బుయ్యని సత్యనారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, సర్పంచ్ లు సీమా సుల్తాన ఖలీద్, పుప్పలి శశికళ మధుసూదన్, నామ్య నాయక్, వెంకటేష్ మహారాజ్, సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్, రాకేష్ మహారాజ్, సుధాకర్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments