HomeNewsపట్లోళ్లపై బురదజల్లడం మానుకోండి...!

పట్లోళ్లపై బురదజల్లడం మానుకోండి…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • పట్లోళ్ల నర్సింహులుపై విమర్శలు సిగ్గుచేటు…! 
  •  బిఆర్ఎస్ నాయకుడు ఇంతియాజ్

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాజకీయాల్లో పార్టీలు శాశ్వతం కాదని, వ్యక్తిగత విలువలూ, గౌరవమే ముఖ్యమని బిఆర్ఎస్ నాయకుడు ఇంతియాజ్ అన్నారు. బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింహులుపై ఇటీవల కొందరు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బిఆర్ఎస్ పార్టీ మాజీ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు సందీప్ రెడ్డి, ఎబినైజర్ వంటి నాయకులు పట్లోళ్ల నర్సింహులును విమర్శించడం హాస్యాస్పదమని ఇంతియాజ్ మండిపడ్డారు. పట్లోళ్ల నర్సింహులు రాజకీయ స్థాయి ఏంటి? మీ స్థాయి ఏంటి? ఆయనను విమర్శించే ముందు మీ గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. నిన్నటి వరకు మీరు కూడా బిఆర్ఎస్ పార్టీలోనే ఉండి, ఇప్పుడు పార్టీ మారగానే విలువలని మర్చిపోవడం సరికాదు” అని హితవు పలికారు.గత మున్సిపల్ పాలనలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. రెండున్నర ఏళ్ల తర్వాత దీపా నర్సింహులు కు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మాట తప్పినప్పటికీ, నర్సింలు ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. పదవి ఇవ్వకపోయినా ప్రజల కోసం, పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. అలాంటి నిబద్ధత గల నాయకుడిపై విమర్శలు చేయడం తగదు” అని స్పష్టం చేశారు.రాజకీయాల్లో మార్పులు సహజమని, కానీ అందరం ఒకే గూటి నుంచి వచ్చిన వాళ్లమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇంతియాజ్ సూచించారు.పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి.స్థానికంగా మనం ఎప్పుడూ కలిసి ఉండేవాళ్లమే. కేవలం పార్టీ మారినంత మాత్రాన పాత సంబంధాలను, గౌరవాన్ని పక్కన పెట్టి మాట్లాడటం మీ సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. పట్లోళ్ల నర్సింహులుపై విమర్శలు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని, ఇప్పటికైనా సంయమనంతో వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments