spot_img
HomeEntertainmentడ‌బ్బు కోసం 'అలాంటి' ప‌నులు చేయ‌ను.. వైర‌ల్‌గా మారిన సాయిప‌ల్ల‌వి కామెంట్స్‌.!

డ‌బ్బు కోసం 'అలాంటి' ప‌నులు చేయ‌ను.. వైర‌ల్‌గా మారిన సాయిప‌ల్ల‌వి కామెంట్స్‌.!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి


డ‌బ్బు కోసం ‘అలాంటి’ ప‌నులు చేయ‌ను.. వైర‌ల్‌గా మారిన సాయిప‌ల్ల‌వి కామెంట్స్‌.!

Jul 10, 2026 3:25PM

సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ రాగానే చాలామంది నటీనటులు తమ పంథా మార్చుకుంటారు. కానీ, గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన విలువలు, సిద్ధాంతాలను ఏర్పరచుకుని, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ‘లేడీ పవర్ స్టార్’గా ఎదిగిన అరుదైన నటి సాయి పల్లవి. మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాలో మలర్ పాత్రతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులను ఆక‌ట్టుకొని అద్భుతమైన స్టార్‌డమ్ సంపాదించుకుంది. వరుస హిట్లతో సౌత్ అగ్ర కథానాయికగా దూసుకుపోతున్నా, తాను స్టార్ అనే గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఎప్పుడూ ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆమెది. తాజాగా సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడనని, తన వ్యక్తిగత విలువల కంటే ఏదీ ఎక్కువ కాదంటూ సాయి పల్లవి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవికి ఒక సూటియైన ప్రశ్న ఎదురైంది. దర్శకులు ఎప్పుడైనా మిమ్మల్ని ముద్దు సన్నివేశాల్లో నటించమని అడిగారా, అసలు అలాంటి సీన్స్ చేయకూడదని మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని యాంకర్ అడగ్గా, సాయి పల్లవి ఏమాత్రం తడబడకుండా, చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అవును, ఇప్పటికీ చాలా మంది దర్శకులు నన్ను ముద్దు సన్నివేశాల్లో నటించమని అడుగుతూనే ఉంటారు, నేను అలాంటి సీన్స్ చేయనని స్పష్టంగా తెలిసినా కూడా ఇప్పటికీ ఆ తరహా ఆఫర్లు వస్తూనే ఉంటాయని ఆమె వెల్లడించారు. ఒకవేళ నాకు ఒక జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ఉండి ఉంటే, కేవలం సినిమా నటన కోసమైనా సరే మరొక వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం అనేది నా మనస్సాక్షికి సరైందిగా అనిపించదని ఆమె స్ప‌ష్టం చేశారు.

ఇదే క్రమంలో డబ్బు, విలాసవంతమైన జీవితంపై తనకున్న దృక్పథాన్ని కూడా సాయి పల్లవి ఎంతో హుందాగా వివరించారు. ఒక సాధారణ మనిషి ఈ సమాజంలో సంతోషంగా ప్రశాంతంగా జీవించడానికి ఒక మంచి కుటుంబం, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, ప్రయాణించడానికి ఒక కారు ఉంటే చాలు అని ఆమె అన్నారు. దేవుడి దయ వల్ల ఆ వసతులన్నీ తనకు ఇప్పటికే ఉన్నాయని, అంతకు మించి ఇంకో లగ్జరీ కారు కొనడానికో, లేదా మరింత విలాసవంతమైన జీవితాన్ని గడపడానికో తాను డబ్బు కోసం కక్కుర్తి పడి మరొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తనకు ఉన్నదానితోనే ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉన్నానని చెప్పారు. కేవలం తన నటన నచ్చి, ఆ పాత్రకు తాను 100 శాతం న్యాయం చేయగలనని నమ్మి ఎంపిక చేసుకుంటేనే సినిమాలు చేస్తానని, ఒకవేళ కథలో ఇంటిమేట్ లేదా ముద్దు సన్నివేశాలు అంత ప్రాధాన్యమైతే, తన స్థానంలో అలాంటి అభ్యంతరాలు లేని వేరే హీరోయిన్‌ను తీసుకోవచ్చని, అందులో తనకు ఎలాంటి కోపం గానీ, అభ్యంతరం గానీ ఉండదని చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సినిమా అవకాశాలు, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కంటే తన ఆత్మగౌరవానికి, వ్యక్తిగత విలువలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె నిర్ణయాన్ని చూసి నెటిజన్లు “దటీజ్ సాయి పల్లవి” అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

 

Sai Pallavi, Sai Pallavi Kissing Scenes, Tollywood Updates



Source link

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments