ఈ ఇద్దరు తల్లి, కొడుకులంట
Jul 9, 2026 6:17PM

ఒక్క సినిమాలోనే ఏదైనా సాధ్యమవుతుంది. అది కూడా న్యాయబద్దంగా, ధర్మ బద్దంగానే. దీంతో అంతిమంగా అభిమానులకి, ప్రేక్షకులకి కావాల్సినంత జోష్.. తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వెట్రిమారన్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ క్రైమ్ డ్రామా ప్రాజెక్ట్ ‘అరాసన్’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలను మూటగట్టుకుంది. వర్సటైల్ హీరో శింబు అలియాస్ సిలంబరసన్ టిఆర్ (STR) నుంచి వస్తున్న మూవీ కావడంతో కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా మొత్తం ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ క్రమంలో ఈ చిత్ర కాస్టింగ్ గురించిన ఒక షాకింగ్, అత్యంత ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.స్టార్ హీరోయిన్, సింగర్ ఆండ్రియా జెర్మియా అరాసన్ లో సిలంబరసన్‌కు తల్లి క్యారక్టర్ లో కనిపిస్తుంది. ఈ కాంబినేషన్ వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, కథ డిమాండ్ మేరకే వెట్రిమారన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆండ్రియా, శింబు ఇద్దరూ గతంలో ‘ఇదు నమ్మ ఆళు’ వంటి రొమాంటిక్ సినిమాల్లో జంటగా నటించారు. ఆ చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాంటిది ఇప్పుడు శింబుకి తల్లిగా ఆండ్రియా నటించడం అనేది ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేస్తోంది. అయితే దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ‘అరాసన్’ చిత్రం రెండు వేర్వేరు టైమ్‌లైన్స్‌తో నడిచే కథ అని సమాచారం. ఈ సినిమా వెట్రిమారన్ గతంలో అద్భుత విజయాన్ని అందుకున్న ‘వడ చెన్నై’ సినిమా విశ్వానికి (Vada Chennai Universe) అనుసంధానంగా ఉండబోతోంది. ‘వడ చెన్నై’ చిత్రంలో చంద్ర అనే పవర్‌ఫుల్ , గంభీరమైన రోల్ లో ఆండ్రియా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోయే ‘అరాసన్’ కథలో కూడా ఆమె అదే ‘చంద్ర;’ రోల్ లో కనిపిస్తుందని టాక్. కథ ప్రకారం ఆ క్యారక్టర్ ప్రయాణంలో భాగంగా తల్లిగా కనిపించాల్సి ఉంటుందట.
Also read: టాలీవుడ్ హీరోల లక్కీ నంబర్ ‘7’.. ‘లెనిన్’తో అఖిల్ అక్కినేని హిట్టు కొడతాడా?
simbu, Andrea jeremiah, vetrimaaran, Arasan







