Home News గులాబీ పార్టీ లోకి విట్టల్ నాయక్..!

గులాబీ పార్టీ లోకి విట్టల్ నాయక్..!

266
0
  • కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి విఠల్ నాయక్
  • గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన పైలెట్ రోహిత్ రెడ్డి.

జనవాహిని ప్రతినిధి తాండూరు :కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఆయన అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. విఠల్ నాయక్‌కు రోహిత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. విఠల్ నాయక్ వంటి అనుభవం ఉన్న నాయకులు పార్టీలోకి రావడం బీఆర్ఎస్‌కు మరింత బలాన్నిస్తుందని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఆయన చేసిన సేవలు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ పార్టీ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.అనంతరం విఠల్ నాయక్ మాట్లాడుతూ.. పైలెట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here