Wednesday, February 4, 2026
Home NEWS ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ వైపే…!

ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ వైపే…!

0
205
  • మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే
  • ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
  • 30కి పైగా స్థానాల్లో గెలుపు ఖాయం.. అభ్యర్థులకు ఎమ్మెల్యే బీఎంఆర్ దిశానిర్దేశం

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని, తాండూరు మున్సిపల్ పీఠాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం తాండూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని, అభ్యర్థులకు బి-ఫామ్‌లు అందజేసి దిశానిర్దేశం చేశారు.అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే తెలిపారు. బీసీలకు 15, మైనారిటీలకు 9, ముదిరాజ్ సామాజిక వర్గానికి 5, వీరశైవులకు 4, మున్నూరు కాపులకు 3, ఎస్సీలకు 3 స్థానాలు కేటాయించామన్నారు. అలాగే కుర్వ, గౌడ్, బ్రాహ్మణ, వైశ్య, ఎస్టీ, ఉప్పరి మరియు రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించి, అన్ని వర్గాల భాగస్వామ్యాన్ని పెంపొందించామని వివరించారు. కష్టపడిన కార్యకర్తలను గుర్తించి కౌన్సిలర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించామని పేర్కొన్నారు.రెండేళ్ల ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరవేసిందని ఎమ్మెల్యే అన్నారు. గత పాలకులు చేయలేని అభివృద్ధిని తాండూరు మున్సిపాలిటీలో ఈ రెండేళ్లలోనే చేసి చూపామన్నారు. అభ్యర్థులు ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించాలి అని పిలుపునిచ్చారు.ప్రతిపక్ష నేతలు ఓటమి భయంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారని, అభ్యర్థులు వారిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు సాగాలని సూచించారు. పోలింగ్ రోజున చివరి ఓటు బ్యాలెట్ బాక్సులో పడే వరకు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ఇంచార్జీలతో సమన్వయం చేసుకుంటూ 30కి పైగా స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధార సింగ్, మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు నరేందర్ రాంశెట్టి, కోఆర్డినేటర్లు ఇఫ్తాకర్, అశోక్ కుమార్, టౌన్ అధ్యక్షులు హబీబ్ లాలా, అభ్యర్థులు, వార్డు ఇంచార్జీలు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here