- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుక
- కాళోజీ పార్కులో మొక్కలు నాటిన కాంగ్రెస్ నాయకులు
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్యాంశంగా వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ పరిధి 26వ వార్డులోని కాళోజీ పార్కులో కాంగ్రెస్ నాయకుడు రాజు గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు విరివిగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ… జననేత, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం నాడు పర్యావరణానికి మేలు చేసేలా మొక్కలు నాటడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. సమాజ శ్రేయస్సు కోరే నాయకుడికి పచ్చదనంతో శుభాకాంక్షలు తెలపడమే నిజమైన కానుక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లేదా పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





