- తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
- నయీమ్ అఫ్ఫు, అబూబకర్ సిద్ధిక్ ఆధ్వర్యంలో బడి పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఇందులో భాగంగా సీనియర్ నాయకుడు నయీమ్ అఫ్ఫు, యూత్ నాయకుడు అబూబకర్ సిద్ధిక్ ల నేతృత్వంలో తాండూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ అందజేశారు.పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటుగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మరింత కాలం ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ రజాక్, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నేతలు, యువజన విభాగం నాయకులు, పాల్గొన్నారు.





