కరీంనగర్ శంకరపట్నం (జనవహిణి బ్యూరో-చిట్యాల బాబు) :- ఇందుమూలముగా సమస్త ప్రజలకు తెలియజేయునది ఏమనగా, గ్రా॥ కేశవపట్నం, మం॥ శంకరపట్నం, జిల్లా, కరీంనగర్ నందు వెలసియున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర తేది. 21-02-2024 నుండి తేది. 24-02-20204 వరకు జరుగును. ఇట్టి జాతరకు సంబంధించిన ఈ దిగువ తెలిపిన టెండర్ కం బహిరంగ వేలములు తేది: 17-01-2024 బుధవారం రోజున ఉదయం 12:00 గం॥లకు కేశవపట్నం గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో నిర్వహించబడును. ఇట్టి వేలములో పాల్గొను 7ఆసక్తి గల వారు టెండర్ షెడ్యూల్ ఫారం తేది 16-01-2024 నుండి 17-01-2024 వరకు ఉదయం 11:00 గం॥ల వరకు రూ.100/-లు చెల్లించి టెండర్ ఫారం పొందగలరు.

క్ర.సం. 1 :- టెంకాయలు అమ్ముకొను హక్కు  2. బెల్లం (బంగారం) అమ్ముకొను హక్కు  3. తల నీలాలు ప్రోగు చేసుకొను హక్కు  4. పుట్నాలు, ప్యాలాలు అమ్ముకొను హక్కు

డిపాజిట్ రూ॥లు 5,000/-, 10,000/- , 30,000/- ,3000/–

కాల పరిమితి :- 21-02-2024 నుండి  24-02-2024 వరకు

వేలములలో పాల్గొనువారు డిపాజిట్ రూపాయలు అంశముల వారిగా నగదు చెల్లించి రశీదు తీసుకొని సీల్డ్ టెండర్కు జతపరిచి తేది: 17-01-2024 రోజున ఉదయం 11:00 గం॥లకు టెండర్ బాక్స్లో వేయవలయును. అదే రోజు ఉదయం 12:00 గం॥లకు వేలము నిర్వహించబడును. ప్రతి వేలమునకు విడి విడిగా రూ.100/-లు చెల్లించి షెడ్యూలు ఫారం ఖరీదు చేయవలయును. ఈ వేలములను ఏ విధమైన కారణములు తెలుపకనే ఆపుటకు గాని, వాయిదా వేయుటకు గాని ఇ.ఓ. గారికి అధికారం ఉంటుంది.

కార్యనిర్వహణాధికారి!!

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గ్రా॥ కేశవపట్నం, మం॥ శంకరపట్నం, జిల్లా, కరీంనగర్.

దీని ప్రతులు: 1) శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర, కేశవపట్నం కార్యాలయము నోటీసు బోర్డుపై అతికించుటకు గాను పంపనైనది.

2) శ్రీయుత తహశీల్దార్, శంకరపట్నం గారి కార్యాలయ నోటీసు బోర్డుపై అతికించుటకు సమర్పించనైనది.

3) శ్రీయుత మండల పరిషత్, శంకరపట్నం కార్యాలయ నోటీను బోర్డుపై అతికించుటకు సమర్పించనైనది.

4) శ్రీయుత గ్రామ పంచాయితీ కార్యాలయం, శంకరపట్నం కార్యాలయ నోటీసు బోర్డుపై అతికించుటకు సమర్పించనైనది.

5) శ్రీయుత సహాయ కమీషనర్, దేవాదాయశాఖ, కరీంనగర్ గారి కార్యాలయ నోటీసు బోర్డుపై అతికించుటకు గాను సమర్పించనైనది.

6) శ్రీయుత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శంకరపట్నం గాతీరి కార్యాలయ నోటీసు బోర్డుపై అతికించుటకు గాను సమర్పించనైనది.

7) వివిధ దినపత్రికలలో వార్త రూవకముగా వ్రచురించుటకు గాను సమర్పించనైనది.