Silver price prediction 2024 : “గ్లోబల్​ గ్రీన్​ ఇనీషియేటివ్స్​, 5జీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్​ సెగ్మెంట్స్​ కారణంగా.. సిల్వర్​కి డిమాండ్​ పెరిగే అవకాశం ఉంది. వెండి కన్నా బంగారం ధర బాగా పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నప్పటికీ.. సిల్వర్​లోనూ మంచి అప్​ట్రెండ్​ కనిపించొచ్చు. రూ. 78,000- రూ. 78,500 వద్ద ఉన్న బలమైన రెసిస్టెన్స్​ దాటితే.. కేజీ వెండి ధర రూ. 88వేలు-95వేల వరకు వెళ్లొచ్చు,” అని సుగంధ సచ్​దేవ అభిప్రాయపడ్డారు.