Ayushi Patel About Lip Lock: తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా హీరోయిన్‌గా వచ్చిన మరో నటి ఆయుషి పటేల్. కలియుగం పట్టణంలో సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా ఆయుషి పటేల్ పరిచయం కానుంది. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు.