Saturn nakshtra transit: శని పేరు చెప్తేనే అందరూ భయపడతారు. ఎలాంటి కష్టాలు వస్తాయో, జీవితం ఎలా మారిపోతుందో అని ఆందోళన చెందుతారు. కానీ శని అనుగ్రహం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కర్మల అనుసారం శని దేవుడు ఫలితాలని ఇస్తాడు. అందుకే న్యాయదేవుడిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలలో శని ఒకటి. ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు ముప్పై సంవత్సరాలు పడుతుంది.