“చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. ఈ సినిమా వండర్ ఫుల్ జర్నీ. ఇది నా ఫేవరేట్ కథ. దర్శకురాలు సంతోషిణి చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాతో తనకి చాలా మంచి పేరు వస్తుంది. ఇందులో నా పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. శ్రీరామ్ గారు, సుబ్బరాజు గారు, ఉత్తేజ్ గారు లాంటి నటులతో పని చేయడం గొప్ప అనుభవం. నిర్మాతలకు ధన్యవాదాలు. మా ట్రైలర్‌ని లాంచ్ చేసిన హరీష్ శంకర్ గారికి ధన్యవాదాలు” అని హీరోయిన్ రితికా సింగ్ తెలిపారు.