హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్

ఈ సంవత్సరం ప్రారంభంలో క్రెటా ఫేస్ లిఫ్ట్ ఎస్ యూవీ (creta facelift) ని లాంచ్ చేసిన తరువాత, హ్యుందాయ్ ఈ సంవత్సరం రెండవ అతిపెద్ద లాంచ్ కు సిద్ధమవుతోంది. మార్చి 11 న కొత్త క్రెటా ఎన్ లైన్ వెర్షన్ ను హ్యుందాయ్ లాంచ్ చేయనుంది. ఐ20 ఎన్ లైన్, వెన్యూ ఎన్ లైన్ వెర్షన్ల తర్వాత భారత్ లో ప్రవేశపెట్టిన మూడో ఎన్ లైన్ మోడల్ ఇది. ఇప్పటికే ఉన్న మోడళ్లకు స్పోర్టియర్ వెర్షన్ లుగా కొన్ని అడ్వాన్స్డ్ మార్పులతో హ్యుందాయ్ ఎన్ లైన్ మోడల్ లను తీసుకువస్తున్నారు. క్రెటా ఎన్ లైన్ ఎక్కువగా క్రెటా ఫేస్ లిఫ్ట్ ఎస్ యూవీని పోలి ఉంటుంది. ఎన్ లైన్ బ్యాడ్జింగ్, డ్యూయల్ ఎగ్జాస్ట్, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, బంపర్లు వంటి మార్పులు ఉంటాయి. ఆల్-బ్లాక్ థీమ్ తో రాబోతున్న ఇంటీరియర్, దాని స్పోర్టీ క్యారెక్టర్ ను మెరుగుపరచడానికి ఎరుపు యాక్సెంట్ లను కలిగి ఉంటుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 158బిహెచ్ పి పవర్, 253ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ తో వస్తుంది.