తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు
నేడు సాయంత్రం 6 గంటలకు నోటిఫికేషన్ విడుదల! తాండూరు జనవాహిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేయనున్నారు.గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగుస్తుండటం, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. నేటి సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ తేదీలు మరియు ఓట్ల లెక్కింపు వంటి పూర్తి వివరాలు ప్రకటించబడతాయి.ప్రస్తుతం, ఎన్నికల...
కేటీఆర్‌ను ముట్టుకునే దమ్ముందా..!
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందే! కవితను జైలుకు పంపింది మేమే.. రాహుల్ యాత్రకు బస్సులిచ్చింది బీఆర్‌ఎఎస్ఏ తాండూరు జానవాహిని ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉన్నది చీకటి ఒప్పందమేనని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "కేటీఆర్‌ను లోపలేసే దమ్ము మీకు లేదు" లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పటి వరకు బీఆర్‌ఎస్...
కేంద్రంతో కలిసి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి..!
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దేశాభివృద్ధే బీజేపీ ఏకైక లక్ష్యం కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు పేరు మార్చి వాడుకుంటున్నాయని విమర్శ మంబాపూర్‌లో 30 అడుగుల బీజేపీ జెండా ఆవిష్కరణ తాండూరు జానవాహిని ప్రతినిధి: దేశాభివృద్ధి ఒక్కటే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, కేంద్రంతో ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో...
ఆగిన గుండెలు, ఆరని కన్నీళ్లు...!
రక్తమోడుతున్న రహదారులు.. మృత్యువుకు ముఖద్వారాలు చేవెళ్ల గాయం మానకముందే.. నిత్యం మృత్యు ఘంటికలే అమ్మానాన్న రాకకోసం.. ఆ పసి హృదయాల ఎదురుచూపు కళ్లెదుటే కరిగిపోయిన పేగుబంధం.. తల్లిదండ్రుల కడుపుకోత రాలిపోయిన గృహజ్యోతి.. దిక్కులేనిదైన బతుకు తాండూరులో మృత్యు విలయం.. రెండు రోజుల్లో ఆరు అనర్థాలు ఈ మరణ మృదంగానికి బాధ్యులెవరు?.. ఆ కుటుంబాలకు దిక్కెవరు. వికారాబాద్ జిల్లా జానవాహిని ప్రతినిధి : ఒకప్పుడు ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్న వికారాబాద్ జిల్లా, నేడు మృత్యు ఘంటికలకు చిరునామాగా మారుతోంది. రోడ్డు ప్రయాణం అంటేనే...
హైవే ముసుగులో 'ఎర్ర' దందా..!
అర్ధరాత్రి అక్రమ 'మట్టి' మాయ! అభివృద్ధి పేరుతో దోపిడీ.. ఆదివారం కూడా ఆగని అక్రమ రవాణా రాజకీయ నేతకు 'కప్పం'.. కళ్లు మూసుకున్న యంత్రాంగం తాండూరు జానవాహిని ప్రతినిధి :- వికారాబాద్ జిల్లా తాండూరు, యాలల మండలాల్లో "నేషనల్ హైవే" నిర్మాణం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అభివృద్ధి ముసుగులో సహజ సంపద అయిన ఎర్ర మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. పగలు ప్రభుత్వ పనులంటూ హడావుడి చేస్తున్న కాంట్రాక్టర్లు.. రాత్రిళ్లు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు మట్టిని అమ్ముకుంటూ సోమ్ము...
బైక్ గొడవతో మనస్థాపం...!
యువకుడి ఆత్మహత్య యాలాల మండలంలో విషాదం.. అగ్గనూరులో ఘటన తాండూరు : బైక్ విషయంలో జరిగిన గొడవ, ఆపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన వికారాబాద్ జిల్లా, యాలాల మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని అగ్గనూరు గ్రామానికి చెందిన సమీర్ ఖాన్, అదే గ్రామానికి చెందిన...
పచ్చని పందిరిలోనే పాడె కట్టారు..!
తలంబ్రాలు పోయాల్సిన చేతులే కన్నీళ్లు తుడిచాయి!పెళ్లింట చావు డప్పు.. పెళ్లికి వచ్చిన వారంతా స్మశానానికి సంగెంకుర్డ్‌లో కన్నీటి సంద్రం. తాండూరు :- మరి కాసేపట్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాలి.. బంధుమిత్రుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారాలి. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆనందం ఆవిరైంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు, తండ్రి శవం ముందు గుండెలు పగిలేలా రోదించడం చూసి యాలల మండలం సంగెంకుర్డ్ గ్రామం కంటతడి పెట్టింది.కూతురి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్న తండ్రి...
SGF జిల్లా క్రికెట్ టోర్నీ విజేత తాండూర్ జట్టు
వికారాబాద్ జట్టు పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం తాండూరు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -14 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో తాండూర్ జట్టు విజేతగా నిలిచింది.. శనివారం పరిగి మినీ స్టేడియంలో తాండూరు- వికారాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వికారాబాద్ జట్టు 10 ఓవర్ల మ్యాచ్ లో 9 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.. అనంతరం బరిలోకి దిగిన...
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో – టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యూహాలకు ప్రజానుకూల ఫలితం ..జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయం
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం, రాష్ట్రంలో ప్రజాభిమానాన్ని ప్రతిబింబిస్తోందని టీపీసీసీ వర్గాలు పేర్కొన్నాయి.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకంలో సమన్వయం, వ్యూహాత్మక ప్రణాళికలు ఈ విజయానికి ప్రధాన కారణమని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే పార్టీకి గ్రాండ్ విక్టరీ అందించడం మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా...
బీసీ సమాజం ఈ దేశానికి వెన్నెముక - జాతీయ పతాక ఆవిష్కరణలో బీసీ నేత కందుకూరి రాజ్ కుమార్
బీసీ సమాజం ఈ దేశానికి వెన్నెముక స్వతంత్రం వచ్చి ఏళ్ల గడిచిన సామాజిక సమానత్వం లేదు స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలి ఇంకా బీసీ సమాజం విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో సరియైన స్థానం పొందలేదు జాతీయ పతాక ఆవిష్కరణలో బీసీ నేత కందుకూరి రాజ్ కుమార్ జానవాహిణి టీవీ తాండూర్ డెస్క్ :- భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు దాటిన సామాజిక సమానత్వం ఇంకా పూర్తిగా రాలేదని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్...












