HomeNewsపార్టీ బలోపేతమే లక్ష్యం...!

పార్టీ బలోపేతమే లక్ష్యం…!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • పార్టీ బలోపేతమే లక్ష్యం,పట్టణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు
  • ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతా: బాతుల నాగు ధీమా
  • వార్డు వార్డునా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన బాతుల నాగు కు పట్టణంలో ఘన స్వాగతం లభించింది. ఆదివారం పట్టణంలోని 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు అఖిల్ బాబా బృందం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అఖిల్ బాబా సమక్షంలో బాతుల నాగుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు.సన్మాన అనంతరం బాతుల నాగు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. పట్టణంలోని అన్ని వార్డుల నాయకులను, పాత-కొత్త కార్యకర్తలను కలుపుకొని, అందరి సలహాలతో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాగుకు పార్టీ శ్రేణుల నుండి మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ కార్యక్రమంలో అఖిల్ బాబా బృందంతో పాటు 5వ వార్డుకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక పాల్గొన్నారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments