HomeNewsతల్లి, కొడుకు బలవన్మరణం...!

తల్లి, కొడుకు బలవన్మరణం…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • కుమారుడికి ఉరివేసి.. తల్లి ఆత్మహత్య..! 
  • యాలాల ఇందిరమ్మ కాలనీలో విషాదం

జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలాల మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఘోర కలివిశేషం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ తల్లి తన కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పోలీసులు మరియు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం…ఇందిరమ్మ కాలనీలోని బ్లాక్ నంబర్ 28లో నివాసముంటున్న బుడిగజంగం గౌరమ్మ (30)కు ఒక కుమారుడు రవికాంత్ ఉన్నాడు. ఆమె తన తల్లిదండ్రులు మరియు సోదరులు ఉండే అదే బ్లాక్‌లోని రూమ్ నంబర్ 1లో నివసిస్తోంది. ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గౌరమ్మ సోదరుడు తుల్జారాం ఇంటికి వచ్చి చూడగా తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉంది.ఎంత పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా దృశ్యం భయానకంగా ఉంది. గౌరమ్మ తన కుమారుడు రవికాంత్‌కు ఉరివేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జీవితంపై విరక్తి చెందడం వల్లనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మరణాలపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతురాలి తల్లి పోచమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments