HomeNewsప్రధాన రహదారిపై షార్ట్ సర్క్యూట్..!

ప్రధాన రహదారిపై షార్ట్ సర్క్యూట్..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం..! 
  • ప్రధాన రహదారిపై 11కేవీ విద్యుత్ తీగల్లో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంటలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో గురువారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. పట్టణం నుండి పెద్దేముల్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వైట్ ప్యాలస్ సమీపంలో 11కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా మంటలు చెలరేగాయి.విద్యుత్ తీగల నుండి మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సకాలంలో వారు స్పందించడంతో మంటలు పక్కనే ఉన్న చెట్లకు లేదా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అరికట్టగలిగారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రాంతంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందికి వేలాడుతుండటమే ఈ వరుస ప్రమాదాలకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో విద్యుత్ తీగలు తగిలి ఒక లారీ పూర్తిగా దగ్ధమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, వేలాడుతున్న 11కేవీ తీగలను సరిచేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments