HomeTelanaganahyderabadవైద్య శిబిరానికి విశేష స్పందన...!

వైద్య శిబిరానికి విశేష స్పందన…!

  • చెంగేశ్‌పూర్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
  •  ప్రజల ఆరోగ్యమే గ్రామాభివృద్ధికి పునాది
  • బీసీ సంఘం, న్యూ లోటస్ హాస్పిటల్ సేవలు అభినందనీయం
  • కందుకూరి రాజ్‌కుమార్ బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు 

జనవాహిని ప్రతినిధి తాండూరు: గ్రామ ప్రజల ఆరోగ్యమే గ్రామ అభివృద్ధికి అసలైన పునాది అని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. చెంగేశ్‌పూర్ గ్రామంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో, తాండూరులోని న్యూ లోటస్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది.ఈ సందర్భంగా కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ… ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం పురోగమిస్తుందని, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవలు అందించిన బీసీ సంఘం ప్రతినిధులకు, వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తాయని ఆయన అన్నారు.ఈ శిబిరంలో న్యూ లోటస్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ జుబేర్ అహ్మద్, డాక్టర్ ఫైనాజ్ అహ్మద్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడంతో పాటు, ఈసీజీ పరీక్షలు, రక్త పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. గ్రామానికి చెందిన మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ సభ్యులు, న్యూ లోటస్ హాస్పిటల్ అధినేత మాణిక్యం, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, నాయకులు రాము ముదిరాజ్, పరమేష్, పాండు గౌడ్, దుబాయ్ వెంకట్, తాండ్ర నరేష్, మంబాపూర్ మంజుల, వినయ్, కిరణ్, ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments