HomeEntertainmentSrinivasa Mangapuram: తండ్రి పేరు నిలబెట్టినట్లేనా.. మాస్ అమ్మ మొగుడు అంటే అంతే మరి!

Srinivasa Mangapuram: తండ్రి పేరు నిలబెట్టినట్లేనా.. మాస్ అమ్మ మొగుడు అంటే అంతే మరి!


Srinivasa Mangapuram: తండ్రి పేరు నిలబెట్టినట్లేనా.. మాస్ అమ్మ మొగుడు అంటే అంతే మరి!

Jul 30, 2026 3:46PM

 

 

ఘట్టమనేని కృష్ణ(Krishna).. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన, విలువైన వజ్రం.. సినిమా సినిమాకి తను ఎదగడమే కాకుండా తెలుగు సినిమాని కూడా ఎదిగేలా చేసాడు. మాస్ అమ్మ మొగుడనే ట్యాగ్ లైన్ తో పాటు కృష్ణ కోసం ఎంత వరకైనా వెళ్లే వీరాభిమానులకి లెక్కే లేదు. ప్రపంచంలోనే అత్యధిక అభిమాన సంఘాలు ఉన్న హీరో కూడా.  దీన్ని బట్టి తెలుగు సినిమాపై కృష్ణ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మరి ఆ లెజండ్రీ పెద్ద కొడుకు మాజీ హీరో రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ ఈ రోజు ‘శ్రీనివాస మంగాపురం’తో సెల్యులాయిడ్ పై అడుగుపెడితే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

మూవీ చూసిన వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ‘శ్రీను, వాసుబాబు అనే రెండు క్యారక్టర్ లలో జై కృష్ణ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. డెబ్యూ మూవీనే రొమాన్స్, యాక్షన్ డ్రామాలో చేసి ఈ రోజుల్లో మెప్పించాలంటే చాలా కష్టం. అలాంటిది తాత, తండ్రి, బాబాయ్ మహేష్ బాబు పేరు నిలబెడుతు  సదరు సన్నివేశాల్లో అత్యంత సహజమైన నటన ప్రదర్శించాడు.తొలి సినిమానే అయినప్పటికీ ఎక్కడా కొత్త నటుడనే భావన కలగకుండా డాన్సులు, యాక్షన్ ఘట్టాలు, భావోద్వేగ సన్నివేశాలలో 100 శాతం  తన ప్రతిభని చాటుకున్నాడు. ముఖ్యంగా మాస్ సన్నివేశాలలో జై కృష్ణ కనబరిచిన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ఆయనలోని పరిణతిని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన తండ్రి రమేష్ బాబు కలలుగన్న నటుడిగా జై కృష్ణ రూపాంతరం చెందాడని ఘట్టమనేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా తడాని కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవ్వగా, జై కృష్ణ మరియు రాశాల మధ్య వచ్చిన రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు, శ్యామ్, నరేష్  లాంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ జై కృష్ణ తనదైన శైలిలో నటనను పండించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ప్రత్యేకంగా “అల్లెలే” సాంగ్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జై కృష్ణ మాస్ మేనియాని వేరే స్థాయికి తీసుకెళ్లాయి.  

 

Also read:  శ్రీనివాస మంగాపురం హైలెట్స్  

తండ్రి రమేష్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, అభిమానుల ప్రేమ జై కృష్ణని  ముందుండి నడిపించాయని ఈ చిత్రం నిరూపించింది. బాబాయ్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా అందించిన ప్రత్యేక ప్రోత్సాహం జై కృష్ణపై ఉన్న అంచనాలను పెంచినప్పటికీ, ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా నిలబెట్టుకుని విజయాన్ని సాధించాడు. ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోవడం ఈ సినిమాకున్న క్రేజ్‌ను సూచిస్తోంది. ఘట్టమనేని వంశంలో మూడో తరం వారసుడిగా అడుగుపెట్టిన జై కృష్ణ, తన తండ్రి రమేష్ బాబు పేరును నిలబెట్టి టాలీవుడ్‌లో భవిష్యత్తులో సుదీర్ఘ ప్రయాణానికి బలమైన పునాది వేసుకున్నారు.

 



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments