HomeEntertainment'శ్రీనివాస మంగాపురం' సినిమా రివ్యూ.. బొమ్మ సూపర్ హిట్..!

‘శ్రీనివాస మంగాపురం’ సినిమా రివ్యూ.. బొమ్మ సూపర్ హిట్..!


‘శ్రీనివాస మంగాపురం’ సినిమా రివ్యూ.. బొమ్మ సూపర్ హిట్..!

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జై కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. వైజయంతి మూవీస్ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశా తడాని హీరోయిన్‌గా నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుందనేది ఇప్పుడు చూద్దాం.

కథ

తిరుపతికి చెందిన పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) తన కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. అలాంటి పెద్దిరెడ్డి కుమార్తె మంగ (రాశా) వెంట, ఆమె ప్రేమను గెలుచుకోవడానికి శ్రీను (జై కృష్ణ) తిరుపతిలో తిరుగుతుంటాడు. అనుకోకుండా శ్రీను, పెద్దిరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీ తేజ్) చేతికి చిక్కుతాడు. ఆ సమయంలో వారిపై ఒక ప్రత్యర్థుల గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. ఆ ప్రమాదం నుంచి సుబ్బారెడ్డిని శ్రీను కాపాడుతాడు. దీంతో శ్రీనుని పెద్దిరెడ్డి ఇంటికి పిలిపిస్తారు. అసలు శ్రీను ఎవరు? మంగ వెనుక పడటానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) పాత్ర ఎలాంటి మలుపు తిప్పింది? వంటి ఆసక్తికర విషయాలు తెరపైనే చూడాలి.

రియల్ హీరో అనిపించుకున్న సల్మాన్ ఖాన్: ఆ రాష్ట్రానికి బాలీవుడ్ భాయ్‌జాన్ అభయహస్తం!
రియల్ హీరో అనిపించుకున్న సల్మాన్ ఖాన్: ఆ రాష్ట్రానికి బాలీవుడ్ భాయ్‌జాన్ అభయహస్తం!

Srinivasa Mangapuram Movie Review Jay Krishna Makes a Stellar Debut Box Office Blockbuster

విశ్లేషణ

దర్శకుడు అజయ్ భూపతి ఎంచుకున్న పాయింట్ కొత్తది కాకపోయినా, ఒక స్టార్ వారసుడిని లాంచ్ చేయడానికి సరిపోయే పూర్తిస్థాయి కమర్షియల్ మాస్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో సక్సెస్ అయ్యారు. హీరో ఎంట్రీ, హీరోయిన్ వెంటపడే సన్నివేశాలు, పెద్దిరెడ్డి పాత్ర చుట్టూ నడిచే సస్పెన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. స్క్రీన్ ప్లే రక్తి కట్టించేలా సాగుతుంది.కథ కొద్దిగా రొటీన్ బాట పట్టినట్లు అనిపించినా, ఊహించని మలుపులు, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాను నిలబెడతాయి.

నటీనటుల ఫర్మామెన్స్

జై కృష్ణ తొలి సినిమా అయినప్పటికీ ఏమాత్రం తడబడకుండా నటించారు. డాన్సులు, యాక్షన్ సీన్స్ మరియు ఎమోషనల్ సన్నివేశాలలో తన టాలెంట్‌ను పూర్తిగా ప్రూవ్ చేసుకున్నారు. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోగా ఆయన ఎంట్రీ అదిరిపోయింది. రాశా తడాని గ్లామర్‌తో పాటు తన అభినయంతో ఆకట్టుకున్నారు. తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేశారు.మోహన్ బాబు స్క్రీన్ మీద కనిపించినంత సేపు తన వాయిస్ మోడ్యులేషన్ మరియు మ్యాజిక్‌తో సినిమా స్థాయిని పెంచేశారు. కిక్ శ్యామ్, నరేష్ , శ్రీ తేజ్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అరంగేట్రం చేయబోతోన్న స్టార్ హీరో
ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అరంగేట్రం చేయబోతోన్న స్టార్ హీరో

సాంకేతిక నిపుణులు

అజయ్ భూపతి టేకింగ్ స్టైలిష్‌గా ఉంది. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దారు. జీవి ప్రకాష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదపించాయి.వైజయంతి మూవీస్ మరియు నిర్మాణ సంస్థలు ఎక్కడా రాజీ పడకుండా రియల్ లొకేషన్స్‌లో రిచ్‌గా తెరకెక్కించారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది.

ఫైనల్‌గా

‘శ్రీనివాస మంగాపురం’ అనేది ఒక పర్ఫెక్ట్ లవ్, యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. జై కృష్ణ తన మొదటి సినిమాతోనే మాస్, క్లాస్ ప్రేక్షకులను అలరించే అన్ని లక్షణాలు ఉన్న హీరోగా నిరూపించుకున్నారు. వీకెండ్‌లో కుటుంబ సమేతంగా థియేటర్లలో ఎంజాయ్ చేయదగ్గ చిత్రం ఇది.

Rating: 2.75/5



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Most Popular

Recent Comments