- ఆ నాయకుడి ఫోటో లేకపోవడం పై చర్చ..
- కావాలనే వెయ్యలేదా.. లేక మర్చిపోయారా…?
- పార్టీ ఒకటే కానీ ప్రోటోకాల్ మరిచారా…?
- గత 3 రోజులుగా తాండూరు లో చర్చలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు లో ఓ ఫ్లెక్సీ వివాదానికి తెరలేపింది ఓ పార్టీ కి చెందిన నాయకుడు ప్రోటోకాల్ మర్చిపోయి… ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా తాండూరు లో ఇదే చర్చ జరుగుతుంది. తాజాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్బంగా మాజీ బీసీ కమిషన్ సభ్యులు తాండూరు లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ…. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫోటో లేకపోవడం చర్చకు దారి తీసింది. కేటీఆర్ జన్మదిన ఫ్లెక్సీ లో రోహిత్ రెడ్డి ఫోటో లేకపోవడం… ఏంటని స్థానికంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. పార్టీ సభ్యులు.. బిఆర్ఎస్ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం…. మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పై వెతిరేకంగా… విమర్శలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే పై సస్పెన్షన్ అని వచ్చిన ఆరోపణల వల్ల ఫ్లెక్సీ లో ఫోటో వెయ్యలేదా… లేక మరిచిపోయారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన తో బిఆర్ఎస్ పార్టీ లో అంతర్గత వర్గాలు ఏర్పాడ్డాయానే ఆరోపణలు వస్తున్నాయి. గత 3 రోజుల నుండి తాండూరు లో ఇదే చర్చ జరగడం గమనార్ధం.