- మనోహర్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు
- సాధారణ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
- తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి బుధవారం సొంత నియోజకవర్గం కోడంగల్‌లో ఎస్‌ఐఆర్‌పై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై చేసిన వాక్యాలను కొందరు వలలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుయ్యని మనోహర్ రెడ్డికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. మనోహర్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో సాధారణంగా, నవ్వుకుంటూ అన్న మాటలను కొందరు కావాలని వక్రీకరించారని బాతుల నాగు స్పష్టం చేశారు. ఎవరో విమర్శించినట్లు, దూషించినట్లు, హేళన చేసినట్లు చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.ఈ సందర్భంగా ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీ నాయకుడిలాగా గంజాయి దందాలు, డ్రగ్స్ సప్లైలు ఇతర వ్యాపారాలు చేయడం మా మనోహర్ అన్నకు తెలీదన్నారు. ఆయన ఎప్పుడూ నీతి నిజాయితీలతోనే వ్యాపారం చేస్తారని స్పష్టం చేశారు.మనోహర్ రెడ్డిపై కావాలని అబద్ధపు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నవారు తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ శ్రేణులు తగిన రీతిలో బుద్ధి చెబుతాయని బాతుల నాగు హెచ్చరించారు. చిల్లర ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, నిజానిజాలను గ్రహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.