HomeTelanaganahyderabadటీఆర్ఎస్‌ఎంఏ అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ గౌడ్

టీఆర్ఎస్‌ఎంఏ అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ గౌడ్

  • తాండూరు ‘టీఆర్ఎస్ఎంఏ’ అధ్యక్షుడిగా మోహన్ కృష్ణ గౌడ్
  •  2026-28 సంవత్సరాలకు నూతన కార్యవర్గం ఎన్నిక
  • ప్రైవేట్ పాఠశాలల హక్కుల సాధనే లక్ష్యం: నూతన కమిటీ

జనవాహిని ప్రతినిధి తాండూరు: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తాండూరు డివిజన్ నూతన కార్యవర్గం బుధవారం కొలువుదీరింది. రాష్ట్ర, వికారాబాద్ జిల్లా కమిటీల పర్యవేక్షణలో 2026–2028 కాలపరిమితికి గాను ఈ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరులోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్య ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సభ్యుల అభిప్రాయాల మేరకు నూతన బాధ్యులను ఖరారు చేశారు. ఈ ఎన్నిక ప్రక్రియను రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నాగయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బస్వరాజ్ గౌడ్, సలహాదారు ముజీబ్ ఉర్ రహ్మాన్, కార్యవర్గ సభ్యుడు నరేష్ రాజుతో పాటు జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వీరేందర్, ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి, కోశాధికారి ప్రకాష్ దగ్గరుండి నిర్వహించారు.

నూతన కార్యవర్గ సభ్యులు…. గౌరవాధ్యక్షులు: కీర్తి శర్మ, అధ్యక్షులు: ఎంవీఎన్ మోహన్ కృష్ణ గౌడ్,ఉపాధ్యక్షులు: వహీద్, ప్రధాన కార్యదర్శి: వెంకటేష్‌, సంయుక్త కార్యదర్శి: సునీత, కోశాధికారి: ఎం.రమేష్‌ గౌడ్,సలహా కమిటీ సభ్యులు: ఇందూరు రాములు, సోహెల్ ఉమ్రి ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ.. గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. తాండూరు డివిజన్‌లో సంఘ ఐక్యతను కాపాడుతూ, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల పలువురు కరస్పాండెంట్లు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments