HomeTelanaganahyderabadఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు..!

ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు..!

  • మా నాయకుడిపై బురద చల్లితే ఊరుకోం
  • కౌన్సిలర్ బంటు వేణు హెచ్చరిక
  • మనోహర్ రెడ్డి వీడియో వక్రీకరణపై మండిపాటు

జనవాహిని ప్రతినిధి తాండూరు: ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నా వీడియో పై మున్సిపల్ కౌన్సిలర్ బంటు వేణు స్పందించారు. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. మనోహర్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రత్యర్థులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఉద్దేశించి మనోహర్ రెడ్డి పై సీఎం సరదాగా, నవ్వుకుంటూ మాట్లాడిన సాధారణ వ్యాఖ్యలను ఏదో పెద్ద ఎత్తున విమర్శించినట్లు, హేళన చేసినట్లు చిత్రీకరించడం శోచనీయమని బంటు వేణు పేర్కొన్నారు.మనోహర్ రెడ్డిపై కావాలని అబద్ధపు ప్రచారాలు చేస్తూ విమర్శలు గుప్పించేవారు తక్షణమే తమ వైఖరిని మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇకనైనా ఇటువంటి చిల్లర ప్రచారాలు ఆపకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతాయని, ప్రజలు కూడా ఈ అసత్యాలను నమ్మవద్దని బంటు వేణు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments